Pravahini


శీర్షిక: దోచుకోవడమే...!

సమాజ ప్రతి చలనంలో... అసమానతల పరిణామంలో... మనుషుల నైతిక జీవనం...
మంట కలిసిపోతుంది...!
 
రాజ్యాంగ సంస్థల నిర్వీర్యంలో... రాజరిక వ్యవస్థల గాంభీర్యంలో... ప్రజాస్వామ్యం ఇప్పుడు...
చరిత్ర పుటల్లో నగ్న చిత్రమైంది...!

గజ్జ కట్టి ఎగిరిన కాళ్లు...
గొంతెత్తి పాడిన గళాలు...
కలాలు పట్టి రాసిన కవనాలు.. ఇనుప కంచెల... బంధీలయినాయి...!

మన కంటికి కనిపించే ప్రజాస్వామ్యం...
నిజమని నమ్మేకాలం...
కాలగర్భంలో...
ఎప్పుడో కలిసిపోయింది...
ఇక మిగిలింది అంతా ...
ఒకరిని ఒకరు దోచుకోవడమే...!

_ కొంపెల్లి రామయ్య( యామిని తేజశ్రీ )ఖమ్మం
చరవాణి: 70 32 50 46 46

0/Post a Comment/Comments