ప్రక్రియ:సున్నితం (50 అద్భుతమైన శతక వచనములు) ---పిల్లి హాజరత్తయ్య, టీచర్, ప్రకాశం జిల్లా.

ప్రక్రియ:సున్నితం (50 అద్భుతమైన శతక వచనములు) ---పిల్లి హాజరత్తయ్య, టీచర్, ప్రకాశం జిల్లా.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️
ప్రక్రియ పేరు: *సున్నితం తెలుగు* 
రూపకర్త : శ్రీమతి నెల్లుట్ల సునీత
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
తెలుగు ప్రాశస్త్యము
 
1) మాండలికాలకు అతీతమైన భాష
మనసు మెచ్చేటి భాష
మమతను సమతను పంచును రా
చూడచక్కని తెలుగు సున్నితంబు

2) సుందరమైన భాష తెలుగు
తేనెలొలుకు భాష తెలుగు
తెలుగుభాష మనకు వెలుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు

 3) అమృతం కురిపించే భాష
ఆలోచన రేకెత్తించే భాష
తెలుగువారి పాలిట కల్పవల్లిరా
చూడచక్కని తెలుగు సున్నితంబు

4) అమ్మ పలుకు వోలె కమ్మనైనది
నాన్న మనసువోలే మధురమైనది
వెన్నెల కురిపించు జీవితాన
చూడచక్కని తెలుగు సున్నితంబు

 5) తెలుగుమాటలు తీయటి ఊటలు
హాయినిచ్చే కమ్మటి పాటలు
తెలుగుభాష ప్రాశస్త్యము గొప్పదిరా
చూడచక్కని తెలుగు సున్నితంబు

విద్యతోనే విషయం వినతి కెక్కు

6) విద్య కీర్తిని ఇస్తుంది
విద్య భోగాన్ని ఇస్తుంది
విద్య మనిషికి రూపాన్నిస్తుంది 
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

7) శీల నిర్మాణమే విద్య
సర్వరోగ నివారిణే విద్య
ఆత్మ సాక్షాత్కారమే విద్య
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

8) విద్య లక్ష్యం సత్యాన్వేషణ
విద్య లక్ష్యం సర్వతోముఖాభివృద్ధి
విద్య లక్ష్యం సార్వజననీక రణం
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

9) జీవిత సమస్యలను పరిష్కరించును
మానసిక శక్తులను అభివృద్ధి చేయును
 దివ్యత్వపు పరిపూర్ణతను వెలికితీయును
చూడచక్కని తెలుగు సున్నితంబు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

10)మానవజాతి ప్రగతికి సాధనం
మూర్తిమత్వ వికాసానికి సోపానం
మంచిగా బ్రతకడానికి ఆధారం
చూడచక్కని తెలుగు సున్నితంబు
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

వ్యవసాయం రైతులకు ఇష్టా నిలయం

 11) కష్టపడి పంటలు పండించు
అందరికి అన్నము ప్రసాదించు
రైతే దేశానికి వెన్నుముక
చూడచక్కని తెలుగు సున్నితంబు!

1 2) పంటలు పండక పోయినా
పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నించు
పట్టువిడిస్తే మనుగడ ప్రశ్నార్ధకం!!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

13) సేద్యం చేసేది ఒకడు
ఫలాలు అనుభవించేది మరొకడు
రైతే రాజయ్యేది ఏనాటికో...?
చూడచక్కని తెలుగు సున్నితంబు!

  14) ప్రకృతి పగబట్టింది రైతన్నపై
ప్రభుత్వాలు మరిచాయి రైతన్నను
ఆత్మహత్యలే శరణ్యమాయే రైతన్నకు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

 15) భుక్తిని అందించేవాడు రైతు 
భుక్తికోసం పరితపించేవాడు రైతు
రైతే దేశానికి సౌభాగ్యం
చూడ చక్కని తెలుగు సున్నితంబు!


మగువ మానవలోకానికి దేవత

16) స్త్రీ సృష్టికి మూలము
స్త్రీ శక్తి స్వరూపము
స్త్రీ జగత్తుకు ఆధారము
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

17) పడతి సహనానికి ప్రతీక
అమ్మ రూపానికి మాతృక
భూమికి దేవుడిచ్చిన వరం
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

18) ఇలలో వెలసిన దేవత
అమ్మగా,ఆలిగా మురిపించు
మహిళలే ఇంటికి వెలుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

19) ఆకాశాన్ని జయించింది మహిళ
ఆత్మవిశ్వాసం కనబరిచింది మహిళ
అవనిపై మేటియైనది మహిళ
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

20) మహిళలపై వివక్షత మానాలి
మహిళలను ప్రతిఒక్కరూ గౌరవించాలి
మహిళా సాధికారత సాధించాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు!!


తరువు మానవ ఆదెరువు

21) చెట్లు భూసారాన్ని రక్షించు
ప్రకృతి సోయగాలు చేకూర్చు
వ్యవసాయంలో ప్రధానపాత్ర పోషించు
చూడచక్కని తెలుగు సున్నితంబు

22) అలంకార వస్తువులకు పెట్టిందిపేరు
పోషక విలువలకు ప్రధానవనరు
ప్రకృతి సంరక్షణ మనబాధ్యత
చూడచక్కని తెలుగు సున్నితంబు

23) మానవ మనుగడకు ఆధారం
పచ్చదనం ప్రగతికి సంకేతం
భవిష్యత్తు తరాలకు జీవనాధారం
చూడచక్కని తెలుగు సున్నితంబు

24) చెట్లు ఆరోగ్యానికి నిలయాలు
మానవాళికి ఆర్థిక వనరులు
దేవుడు మనిషికిచ్చిన వరాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

25) పర్యావరణానికి చెట్లు ప్రాణాలు
జీవనానికి మూలం మొక్కలు
మొక్కలు నాటడం దేవకార్యం
చూడచక్కని తెలుగు సున్నితంబు


జలం మానవ బలం

26) జలము ప్రాణులకు  ప్రాణాధారము
జలము ప్రగతికి మూలాధారము
జలమే జగమునకు జీవనాధారము
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

27)జలము జీవులన్నిటికి అత్యవసరము 
మానవాళి మనుగడకు ముఖ్యము
ప్రకృతి ప్రసాదించిన వరము
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

28) తరుగుతోంది జల నిధి
పెంచడం మన విధి
జలమే మన సన్నిధి
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

29) నీటిని ఒడిసి పట్టు
కరువును తరిమి కొట్టు
భావితరాలకు ప్రాణభిక్ష పెట్టు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

30) జలము త్రాగుటకు అవసరము
జలము పంటలకు ప్రధానము
జలమును వృధాచేయడం నేరము
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

కార్తీకమాసంబు కడు మహత్వంబు

31) కార్తీక మాసం మహి మాన్వితమైనది
శివ కేశవులకి ప్రీతికరమైనది
స్నానములకు, వ్రతములకు శుభప్రదమైనది
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

32) వేదములకు సమానమైన శాస్త్రములు
గంగకు పుణ్యప్రదములైన తీర్థ ములు
కార్తీకమాసమునకు సమానమైనవి లేవు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

33) కార్తీకదీపాలు నదిలో వెలిగించు
కేదారేశ్వర వ్రతం గావించు
నదీ స్నానాలు ఆచరించు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

34) కార్తీకపౌర్ణమికి విశిష్టత ఎక్కువ
శివుని అనుగ్రహం కలుగు
సకల దోషాలు తోలుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

35) ఉపవాస దీక్షలు ఆచరించు
స్నానం పుణ్యఫలాలను ప్రాప్తించు
దానం సౌభాగ్యాలను కలిగించు
చూడచక్కని తెలుగు సున్నితంబు!!


తుంగభద్ర పుష్కరాలు
        
36)గురుడు మకరరాశిలో ప్రవేశించు
తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించు
ఆంధ్రప్రదేశ్  వైభవంగా నిర్వహించు
చూడచక్కని తెలుగు సున్నితంబు. 
        
37)తుంగభద్ర పంచగంగలో ఒకటి
తుంగభద్ర పుష్కర ఘాట్ లలో
అలంపూర్, మంత్రాలయం ప్రముఖమైనవి
చూడచక్కని తెలుగు సున్నితంబు. 
             
38)పుష్కర స్నానం పుణ్యప్రదము
స్నానాలు ఆచరించిన శుభము
పోగొట్టు మానవుని పాపము
చూడచక్కని తెలుగు సున్నితంబు. 
           
39)పితృదేవతలకు తర్పణాలు గావించు
పూజలు,దానాలు ఆచరించు
పన్నెండు రోజులు స్నానమాచరించు
చూడచక్కని తెలుగు సున్నితంబు. 
          
40)జీవరాసులకు ప్రధానమైనది జలము
నదీ స్నానము ఆరోగ్యాన్నిచ్చు
నదీస్నానాన్ని గుర్తుచేసేవే పుష్కరాలు
చూడ చక్కని తెలుగు సున్నితంబు


శ్రీ శ్రీ

41)కవిత్వసీమను విశాలతరం చేసి
అంతర్జాతీయ దృక్పథాన్ని కలిగించిన
తెలుగుసాహిత్యపు మహాకవి శ్రీ శ్రీ
చూడచక్కని తెలుగు సున్నితంబు

42)ఇతిహాసపు చీకటి కోణాలను
దాచేస్తే దాగని సత్యాలను
వెలికితీసిన మహానుభావుడు శ్రీ శ్రీ
చూడచక్కని తెలుగు సున్నితంబు

43)దీనులను హృదయానికి హత్తుకున్నాడు
హీనులకోసం కలం పట్టి
అభ్యుదయ కవులకు ఆదర్శప్రాయుడైనాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు

44)సంఘనీతిని,కట్టుబాట్లనుధిక్కరించినాడు
ఉద్యమాలలో చురుకైనపాత్ర వహించినాడు
తెలుగుజాతికి వెలుగుబాటను చూపినాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు

45) లోకం ప్రతిఫలించే విధంగా
జాతిజనులు పాడుకునే మంత్రంగా
కవిత్వాన్ని తెలుగుజాతికి అందించినాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు


శ్రమ శక్తి

 46) రక్తాన్ని చెమటగా ధారవోసి
రేయనక పగలనక కష్టించి
సమాజగతిని మార్చే శ్రామికులం
చూడచక్కని తెలుగు సున్నితంబు

 47) దళారులు మోసం చేసినా
ఆశించిన ప్రతిఫలం రాకున్నా
 శ్రమనే ఆయుధంగా నమ్మినవాళ్ళం
చూడచక్కని తెలుగు సున్నితంబు

 48) ప్రజల ఆకలిని తీర్చుతాం
దేశప్రగతికి పునాది వేస్తాం
జాతి భవిష్యత్తును నిర్మిస్తాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

49) కార్మికచట్టాలు ఎన్ని ఉన్నా
జీవన పోరాటంలో ఓడుతాం
హక్కుల సాధనకై ఉద్యమిస్తాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

50) కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా
సామాజిక భద్రతే లక్ష్యంగా
సమసమాజ స్థాపనకు కృషిచేస్తాం
చూడచక్కని తెలుగు సున్నితంబు


*********************

పిల్లి హాజరత్తయ్య

0/Post a Comment/Comments