మానవ అక్రమ రవాణా ప్రపంచమంతా సిగ్గుపడే నేరపూరిత వ్యవస్థ. చైతన్యం ద్వారా మూలాలు వెతికి దీనిని అరికట్టాలి. ---వడ్డేపల్లి మల్లేశము-9014206412

మానవ అక్రమ రవాణా ప్రపంచమంతా సిగ్గుపడే నేరపూరిత వ్యవస్థ. చైతన్యం ద్వారా మూలాలు వెతికి దీనిని అరికట్టాలి. ---వడ్డేపల్లి మల్లేశము-9014206412


మానవ అక్రమ రవాణా ప్రపంచమంతా సిగ్గుపడే  నేరపూరిత వ్యవస్థ. చైతన్యం ద్వారా మూలాలు వెతికి దీనిని అరికట్టాలి.

---వడ్డేపల్లి మల్లేశము9014206412



అనేక సామాజిక రుగ్మతల తో పాటు ఇవాళ ప్రపంచం యావత్తూ మానవ అక్రమ రవాణా  అనే దుర్మార్గపు నేరపూరిత అవమానాన్ని రోదనలతో భరిస్తున్నది. కారణాలు ఎన్నున్నా మానవ బలహీనతలు, అత్యాశ బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యము, కుటుంబం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం లాంటి అనేక బలహీనత లతో పాటు  పలు సందర్భాలలో ప్రజలు ఆడంబరాల జోలికి పోయి మోసపోతున్న అనుభవాలు మనకు ఎన్నో ఉన్నాయి.



 మానవ అక్రమ రవాణా నిర్వచనం:


ఏ వ్యక్తినైనా వారి అనుమతితో లేదా అనుమతి లేకుండా వెట్టిచాకిరీ చేయించుకోవడం ,డబ్బు ఆశ చూపి బలవంతంగా మోసపూరితంగా శారీరక ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఆశించే ఇతరత్రా ప్రయోజనాలు అన్నీ కూడా మానవ అక్రమ రవాణా లో భాగము అని ఐక్యరాజ్య సమితి  నిర్వచించినది. అంటే ఇక్కడ బలి అయ్యే వారి  వల్ల పొందే ప్రయోజనాలు , ముఠాల లాభాలు, అత్యాశ దీనికి ప్రధాన కారణమని తెలుస్తున్నది.



మానవ అక్రమ రవాణా జరగడానికి ప్రధాన కారణాలు:


 కుటుంబ లోపాలు లొసుగులు బలహీనతలను బయట పెట్టుకోవడం, డబ్బు కోసం అత్యాశతో తో ఉచ్చులో చిక్కుకున్న ప్రమాదం వంటివి కొన్ని కారణాలు.కుటుంబాల పేదరికం ఆసరాగా ఉపాధి పేరుతో ముఠాలు ఆకర్షించి నప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోకుండా మోసపోవడం ,ఎక్కువ వేతనాలను నమ్మి చిక్కిపోవడం మరికొన్ని. సులువుగా సంపాదించాలనే  పేరాశ, ఖరీదైన జీవితము ,రంగులకల ను ముందుగానే అతిగా ఊహించుకోవడం, కుటుంబ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబ యజమాని లొంగిపోవడం మరికొన్ని సందర్భాల్లో కారణాలవుతున్నాయి.


ప్రేమ పేరుతో లొంగదీసుకోవడం, శారీరక ఆర్థిక బలహీనతలను ఆసరా చేసుకుని మ్మించే క్రమములో మధ్యవర్తుల పై అతిగా ఆధారపడి భవిష్యత్తు ఊహించకుండా ముఠాలకు చిక్కి దారీ తెన్నూ లేకుండా మోసపోయిన వ్యక్తులు అనేకం .దీనికి పురుషులు, స్త్రీ ,బాలలు బాలికలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు బలవుతూనే ఉన్నారు. ప్రధానంగా హైదరాబాదు లాంటి  నగరాలలో పేద కుటుంబాలకు చెందిన టువంటి ముస్లిం ఇతర బాలికలను కొన్ని ముఠాలు దుబాయ్ లాంటి చోట్ల  ఉన్నత వర్గాలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటే వాళ్లు మాత్రం అక్కడ నరకయాతన అనుభవించి కుటుంబాలకు దూరం అయిన వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు.



 కొన్ని వాస్తవ గణాంకాలు:


నేర రికార్డుల ప్రకారం అక్రమ రవాణా ముఠాల బారిన పడుతున్న వారిలో 95 శాతం మంది నిరుపేద ,వెనుకబడిన తరగతులకు చెందిన వారే.

- జాతీయ నేర పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం 2016 లో భారతదేశంలో అక్రమ రవాణాకు గురైన వారి సంఖ్య 19223 మంది మహిళలు ఈ సంఖ్య 2015 తో పోల్చుకుంటే  25 శాతం అధికం.

- అక్రమ రవాణాలో దక్షిణాసియా ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉండడం ఆందోళన కలిగించే విషయం 

- ప్రపంచంలో 167 దేశాలలో మానవ అక్రమ రవాణా జరుగుతుండగా 140 దేశాల్లో ఈ పరిస్థితులు మరీ దుర్భరంగా ఉన్నాయి. 2012లో అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా ప్రకారం రెండు కోట్ల 10 లక్షల మంది ఈ ఆధునిక బానిసత్వంలో కొనసాగుతుంటే 63 శాతం శ్రమదోపిడి లో 22 శాతం లైంగిక బానిసత్వంలో 10 శాతం ప్రభుత్వాల నిర్బంధ శ్రమ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.

- 12 నుండి 14 సంవత్సరముల బాలికలను బలవంతంగా వ్యభిచార ములోకిదింపుతూ ముఠాలు సొమ్ముచేసుకుంటుంటే కన్న తల్లిదండ్రులు పిల్లల కోసం దిక్కుతోచక ఎదురుచూస్తున్నారు.

- ప్రపంచ వ్యాప్తంగా మొత్తము బాధితుల లో 74 శాతం మంది పెద్దవాళ్ళు శ్రమ దోపిడీ లైంగిక దోపిడీ లో ఉంటే చిన్నపిల్లలు 26 శాతం మంది హోటళ్లు బార్లు పరిశ్రమలలో నిర్బంధ పనుల్లో మూలుగుతున్నారు . -హైదరాబాదు సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోవివిధ ప్రాంతాలలో మనుషుల ఆచూకీ దొరకని మిస్సింగ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శిశు సంక్షేమ, రాష్ట్ర పోలీసు శాఖ సంయుక్త గణాంకాలను బట్టి 2016 జూన్ చివరి నాటికి 6490  మంది ఆచూకీ తెలియకుండా  పోవడం ఆందోళనకరమైన విషయం.



అక్రమ రవాణా రూపాలు;


చట్టాలున్నా న్యాయ వ్యవస్థలు ఉన్న ప్రజా చైతన్యం ఉన్నట్లే కనపడిన వ్యవస్థలోని లోపాలు కారణంగా మానవ అక్రమ రవాణా యధేచ్ఛగా కొనసాగుతున్నప్పుడు కొనసాగుతున్న రూపాలను అవగాహన చేసుకుని ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, నిఘా సంస్థలు కేంద్ర సంస్థలు,  ఈ అక్రమ రవాణా దుర్మార్గానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ అక్రమ రవాణా ఐదు రూపాల్లో కొనసాగుతున్నదని  విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.


- శ్రమదోపిడి

- లైంగిక దోపిడీ

- పునరుత్పాదక దోపిడీ

- మాదక ద్రవ్యాల రవాణా  చేరవేత పంపిణీ

- భిక్షుక వృత్తి లో దింపి అవకాశాలను సొమ్ముచేసుకోవడం.

  


మచ్చుకు రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు:


గత రెండు సంవత్సరాల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి వ్యభిచార  గృహాలపై జరిగిన దాడిలో కొందరి ఆచూకీ దొరికినప్పటికి తప్పిపోయిన వారి పిల్లలు దొరుకుతారు అని ఆశ పడ్డ వారు  కన్నీళ్లు పెట్టిన అనేకమంది తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. భయంకరమైన  విషయం ఏమిటంటే 12 ,14 సంవత్సరాల అమ్మాయి లకు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా వారిలో మెచ్యూరిటీ పెంచి వ్యభిచార గృహాలు నడిపిన నిర్వాహకులపై దర్యాప్తు నామమాత్రంగానే మిగిలిపో వడం.

- కేవలం 50 వేల ఆర్థిక లాభం కోసం పాతబస్తీలోని 14 ఏళ్ల అమ్మాయిని60ఏళ్ల దుబాయ్ షేక్ కెఅమ్మేసిన సంఘటన పత్రికల్లో వచ్చిన సంచలన వార్త.

- ఉపాధి లేక వలస కూలీగా అరబ్ దేశాలకు వెళ్ళిన  మహిళను మధ్యవర్తులు అక్కడి షేకలకు అమ్మేస్తే ఆమె చేసిన ఆర్తనాదాలు లోకమంతా వినిపించాయి. అయినా విచారణ జరిగి ఏం ఫలితం వచ్చిందో, తమ వాళ్లను చేరుకున్నారో లేదో ఇప్పటివరకు తెలియదు.



 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం నేపథ్యం:


ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కొనసాగుతున్న తీవ్ర విషయాలను వర్తమాన సమాజం  వింటున్న చేయగలిగింది మాత్రం ఏమీ లేకపోవడం బాధాకరం. పాలకుల్లో చిత్తశుద్ధి ,చట్టాలను సద్వినియోగం చేసుకుంటే దీనికి అడ్డుకట్ట వేయవచ్చు .గనుల్లో కార్ఖానాల్లో నిర్బంధ పనుల్లో  బాలికలతో, మహిళలతో నిర్బంధ పనులు చేయించుకుంటున్న వెట్టిచాకిరి, లైంగిక దోపిడి చూచి కలత చెందిన ఐక్యరాజ్యసమితి 2014 జూలై 30 వ తేదీన తొలిసారిగా మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని నిర్వహించింది అక్రమరవాణా అనేది నేరపూరిత వ్యవస్థఅని గర్హిస్తూ తీర్మానించి నది.

వియన్నాలోని ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాల నేరాల నివారణ కార్యాలయంలో బాధితుల స్వేచ్ఛకు, ఆకాంక్షలకు సంఘీభావంగా కార్ లో చిన్న పిల్లలు 500 నీలిరంగు హృదయాకారము బెలూన్లను గాలిలోకి ఎగురవేసి తమ ఆకాంక్షను వ్యక్తం చేయడంతో ఈ దినోత్సవానికి ప్రాధాన్యత ప్రారంభమైప్రతి ఏటా జూలై 30వ తేదీన ఈ దినోత్సవం కొనసాగుతున్నది.



అడ్డుకట్ట వేయడం ఎలా:


ఇలాంటి నేరాలు అనుకోకుండా జరుగుతున్నవి కావు .సమాజంలో నేరపూరిత అసాంఘిక శక్తులు విజృంభిస్తున్న సందర్భంగా బాధితుల భయం, అనైక్యత, నిరక్షరాస్యత వలన పౌర సంస్థల ఉదాసీనత బాధ్యతారాహిత్యం వైఫల్యాల వలన భయంకరమైన దోపిడీ వ్యవస్థ కొనసాగుతున్నది. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సమాన బాధ్యత స్వీకరించి అత్యాశలకు పోకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం లేదా ప్రభుత్వం కల్పించిన ఉపాధిని వెతుక్కోవడం ద్వారా ప్రభుత్వం, ప్రజలు చురుకుగా సమన్వయంతో పని చేయవలసి ఉంది. స్వేచ్ఛా స్వాతంత్య్రాల తో సమున్నతంగా జీవించవలసిన దిపోయి అక్రమాల వలలో చిక్కి జీవితాన్ని కోల్పోవడం ఆధునిక ప్రపంచంలో మానవతా విలువలకు గండి పడినట్లే. ఎంత తొందరగా వీలైతే అంత పకడ్బందీగా దీనికి అడ్డుకట్ట వేయాలని మనసారా కోరుకుందాం.



సూచన:

          మానవ అక్రమ రవాణా వ్యవస్థ నుండి బయట పడిన వారికి సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉజ్వల అనే పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించినది.

- హైదరాబాద్ పాతబస్తీలో షాహీన్ పేరుతో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ, జాతీయ స్థాయిలో  గల స్వచ్ఛంద సంస్థ ఈ విషయంలో దర్యాప్తును ప్రారంభించి యంత్రాంగంతో తప్పిపోయిన వారిని ,  మోసపోయిన వారిని వెతికి ఎంతోమందికి దారి చూపించిన అనుభవం వీరికి ఉంది. వీరికి నిండు మనసుతో అభినందనలు తెలియ జేద్దాం.


(రచయిత వడ్డేపల్లి మల్లేశం సామాజిక విశ్లేషకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి  హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)

 30జులై ప్రపంచ మానవ అక్రమ రవానవ్యతిరేక దినం సందర్భ వ్యాసం

0/Post a Comment/Comments