అందమైన ఆషాడం --పసుమర్తి నాగేశ్వరరావు, టీచర్, సాలూరు.

అందమైన ఆషాడం --పసుమర్తి నాగేశ్వరరావు, టీచర్, సాలూరు.

అందమైన ఆషాడం

జగన్నాథుని రథచక్రాలు కదిలే వేళా
గ్రీష్మ ఋతువు కొనసాగు వేళా
కొత్తజంటకు తప్పని యెడబాటు వేళా
తొలకరిజల్లులు కురిసే వేళా

అన్నదాతలు పంటపొలాల్లో పనుల్లో మునిగే వేళా
కొత్తపంటలకు శ్రీకారం చుట్టు వేళా
ఆడవారి హస్తములు గోరింట ముగ్గులతో నిండువేళా
వస్త్ర దుకాణదారులు మంచి ఆఫర్స్ ఇచ్చువేళ

దేవుడు నిదురించే మాసపు వేళా
శుభకార్యాలకు విశ్రాంతి వేళా
బోనాలపండగా శాకాంబరీ వారాహి ల పండగ వేళ
శ్రావణమాసంలో శుభకార్యాలకు సంసిద్ధమగు వేళా

ఆషాడం కాదు శూన్యమాసం
రాబోయే శ్రావణ శుభకాలానికి సుస్వాగత మాసం
బంగారు ధరలు దిగివచ్చే మాసం
శుభసమయాలకు స్వాగతమాసం

వన్నె ధర నింగి దిగు వేళా
వన్నెలందరు చిందులు వేసేవేళ
తొలి ఏకాదశి సంబరాల వేళా
వాన చినుకులతో పుడమితల్లి పులకించు వేళా

ఆషాడమబ్బులతో ఆకాశం అందాలు అందించు వేళా
భూమాత కొగ్రొత్త సిరుల పంటకు నాంది పలుకు వేళా
అందమైన ఆషాడం అందరిని అలరించే వేళా
అందుకో ఆషాఢమాసమా మా అభినందనల మందారమాల

రచన: పసుమర్తి నాగేశ్వరరావు
            సాలూరు టీచర్
            9441530829
            విజయనగరం జిల్లా


0/Post a Comment/Comments