విశ్వాసం లేని మనుష్యులు --డా. కందేపి రాణీప్రసాద్.

విశ్వాసం లేని మనుష్యులు --డా. కందేపి రాణీప్రసాద్.


విశ్వాసం లేని మనుష్యులు 
        --డా. కందేపి రాణీప్రసాద్.

ఆ వీధిలో ఒక కుక్క ఉంటున్నది. అది ఆ వీధిలోని అన్నీ ఇళ్లకు కాపలా కాస్తున్నది. ఆ ఇళ్లకు కాపలా కాయమని ఎవరు చెప్పలేదు. ఆ ఇళ్ల వాళ్ళు అసలే అడగలేదు. అయినా తన భాధ్యతగా కాపలా కాస్తున్నది. ఆ వీధిలోకి ఏ దొంగోడన్నాఅడుగుపెట్టలంటే హడలి చావాల్సిందే. వీధిలోని కుటుంబాల వాళ్ళందరూ దానికి గుర్తే. అంతేకాదు వాళ్ళింటికి వచ్చే చుట్టలందరూ కూడా దానికి తెలుసు. అందర్నీ చక్కగా గుర్తుపెట్టుకుంటుంది. అర్థరాత్రిపూట రైళ్లు దిగి వచ్చిన చుట్టల్ని కూడా చూసి తోక ఊపుతోంది. దాని పలకరింపులు అది పలకరిస్తుంది. వాళ్ళు మాత్రం ఛాయ్ ఛాయ్ అంటూ కసురుకుంటారు. అయినా కోపం తెచ్చుకోకుండా వాళ్ళు ఎవరింటికి వచ్చారో ఆ ఇంటి దాకా సాగనంపి వస్తుంది. అదే కొత్త మొహాలు కనిపిస్తే చాలు పళ్లన్నీబయట పెట్టి పెద్దగా భౌభౌ అంటూ భయంకరంగా అరుస్తుంది. దీని అరుపులకు వాళ్ళు పారిపోతారి. అది పెద్దగా అరిచినప్పుడు తెలుస్తుంది, దీనికి గ్రామసింహం అని పేరెందుకుకొచ్చిందో. సింహానికి ఏమాత్రం తక్కువ కాదు.

ఆ వీధి మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది. దాని పక్కనే ఒక లైటు స్తంభం ఉంటుంది. మన హీరో కూక గారి స్థావరం ఆ చెట్టు కిందే పగలూ రాత్రినూ. పగలేమో చెట్టు కింద పాడుకుంటే చల్లగా ఉంటుంది. రాత్రికేమో ఆ లైటు వెలుగు పడుతుంది. అక్కడ నుంచి వీధి వీదంతా కనిపిస్తుంది. అందుకే కుక్క రోజు అక్కడే పడుకుంటుంది. అక్కడ మట్టిని కొంచెం తవ్వుకొని గుంటలా చేసుకుంది. ఆ గుంటలో పాడుకుంటే దానికి స్వర్గం కూడా గుర్తుకురాదు. అలా గుంటలో పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. 'ఇక ఎవరింట్లోనూ అన్నం తినకూడదు. వాళ్ల చేత తిట్టించుకోకూడదు' అని. కానీ ఒక్కసారి గుంటలో నుంచి లేచి తోక దులుపుకుందా ఏ ఇంట్లోకెళ్లి అన్నం తిందామా అని చూస్తుంటుంది. మరి ఏం చేస్తుంది. కడుపులో ఆకలి ఊరికే ఉండనివ్వదు కదా! అప్పుడప్పుడు ఆ కుక్క అలోచిస్తుంటుంది – అనాధలకు ఆశ్రమం పెట్టినట్లుగా అనాధ కుక్కలకు కూడా ఆశ్రమం పెట్టవచ్చు కదా!

రోజులాగే ఆ గుంటలో అప్పటిదాకా నిద్రపోయి లేచింది. మధ్యాహ్నమయింది. ఆకలి వేస్తుంది. అసలు ఈ వీధిలోని మనుష్యులెవరికి కొంచెం కూడా కృతజ్ఞత లేదు. నేను రాత్రంతా మిలుకుని కాపలా డ్యూటీ చేస్తున్నాను కదా. పగలూ పూట నాక్కొంచెం పిల్లిచి అన్నం పెట్టవచ్చు కదా! మిగిలిన అన్నమంతా డస్ట్ బిన్ లో పారేస్తారు తప్ప నాకు పిలిచి పెట్టనే పెట్టరు.

సరే వాళ్ళ పనులు వాళ్లకుంటాయి కదా! పోనిలే నేనే వెలతను అనుకొనీ కుక్క ఒక ఇంటికి వెళ్లింది. ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ పనుల్లో వాళ్లున్నారు. కానీ ఎవరు కుక్కను గమనించలేదు. పిలిచి అన్నం పెట్టలేదు. సరేలే ఏం చేస్తాం అనుకోని ఇంకొంచెం లోపలికి వెళ్లింది. ఊహూ ఎవరు కనిపించలేదు. తొంగి చూస్తే ఎవరి పనిలో వాళ్లున్నారు. ఏం చేయాలా అని ఆలోచించింది. పోనిలే ఇంటివాళ్లు వాళ్ళ పని మీద వాళ్లున్నారు. వాళ్ళను డిస్ట్రబ్ చేయడం ఎందుకు? నేనే లోపలికి వెళ్ళి అన్నం పెట్టుకుని తింటే పోలా! వాళ్ల పనుల్లోంచి బయటికి వచ్చి నాకైతే అన్నం పెట్టెలా లేరు. నాకేమో బాగా ఆకలి వేస్తుంది. 'చూద్దాం వంటింట్లోకి వెళ్లి' అని మెల్లగా వంటింటి తలుపు తీసుకొని లోపలికి వెళ్లింది.

వంటింట్లో అన్నం పప్పు, కూరలు అన్నీ కనిపిస్తున్నాయి. మంచి వాసనతో నోరూరిస్తున్నాయి. అంతే ఆగలేకపోయింది. వెంటే వెళ్లి ఆదరాబాదరాగా అన్నం పెట్టుకొని తినేసింది. అబ్బా కడుపు నిండిపోయింది. సంతోషంగా బయటికి వెళ్లిపోదాం అనుకుంది. అంతలోనే ఇంటివాళ్లు కుక్కను చూశారు.

'అయ్యో! అయ్యో! కుక్క అన్నమంతా తినేసింది' అంటూ కర్రను తీసుకొచ్చి కుక్కను కొట్టింది ఆ ఇంటి ఇల్లాలు. "అరే నేనేం చేశాను! మీరు పిలిచి అన్నం పెట్టలేదు. పోనిలే మీ పని డిస్ట్రబ్ చేయడం దేనికిలే అని నేనే అన్నం పెట్టుకొని తింటే నన్ను కొడతారా? ఏం మనుష్యులండీ వీళ్లు. అసలు విశ్వాసం అనేదే లేదు" అని కుక్క బాధపడుతూ బయటికి నడిచింది. 


0/Post a Comment/Comments