జీవిత మాధుర్యం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

జీవిత మాధుర్యం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

జీవిత మాధుర్యం..!(కవిత)


జీవితాన్ని ఎలా జీవించాలో,
కూడ ఆలోచించాల్సిన విషయమే..!?

నేటి మనిషి జీవితం, యాంత్రికమైపోయింది..!?
ఉదయం లేచింది మొదలు ,
పరుగులాట లాగ అయిపోయింది..!?

ఇంకెక్కడి జీవిత ఆస్వాదన..!?
ఇంకెక్కడి ప్రశాంతత..!??

ఐనా మనిషి అనుకుంటే..
నిత్య జీవన సరళిలో నుంటూనే..అన్ని
పనులు ఎలాంటి 
గాబరాతనం లేకుండా హాయిగా.. 
స్వతంత్రంగా.. చేసుకుపోతుంటే..
ఆ పనిలోనే 
రసాస్వాదన పొందవచ్చు..!

ఆ రకంగా..
జీవితానందము..
జీవితమాధుర్యం.. పొందవచ్చు..!

ప్రతి పనినీ భారంగా కాకుండా..
ఇష్టంగా చేస్తూ పోవడం ముందు నేర్చుకోవాలి..!?

అప్పుడు గాని,
"జీవిత మాధుర్యం" అంటే ఏమిటో అర్థంకాదు..!
కేవలం పనులనే గాక,అన్ని బాధ్యతల్ని 
సక్రమంగా నిర్వర్తించిన వేళ.. 
జీవన మాధుర్యం దర్శనమిచ్చి తీరుతుంది..!

ఇంకా అన్నివిధాలుగా సామాజిక,కుటుంబ వ్యవహారాలు.. 
సంతృప్తికరంగా ఉండేలా చూసుకోవాలి..!
అప్పుడు జీవితం..ఆనందమే..!
జీవితం..సంతోషమే..!!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,
నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.

0/Post a Comment/Comments