సంకల్పమే అస్త్రం ---సంకల్పమే అస్త్రం

సంకల్పమే అస్త్రం ---సంకల్పమే అస్త్రం

సంకల్పమే అస్త్రం(వచనకవిత)
--- డా. రామక కృష్ణమూర్తి, హైదరాబాద్.


ఏమిటి నీ సందేహం?
ఎందుకా వెనుకంజ?
దేని కోసం నీ తపన?
నడువు ముందుకు!
వెనకకు లాగేవారున్నా,
ఎగతాళి చేసేవారి ముందు
బలంగా నడవాలి.
భయమే నీ శత్రువు సోదరా!
నిర్భయంగా సాగాలి.
ఆలోచనల ప్రవాహాలకు 
అడ్డుకట్ట వేసి,అనవసరపు
అపోహలను ప్రక్కకు తోసి,
అదేపనిగా నిన్ను నిరుత్సాహపరుస్తున్న వారిని
లెక్కచేయక,నీ శక్తే నీకు సాయంగా,
నీ ధైర్యమే నీకు రక్షగా సాగిపోవాలి,గెలవాలి,
నిలవాలి,భయాన్ని బెంబేలెత్తించి పారద్రోలాలి.0/Post a Comment/Comments