వివేకానంద మనోభావన ..దేశ భవిష్యత్తుకు స్ఫూర్తి

వివేకానంద మనోభావన ..దేశ భవిష్యత్తుకు స్ఫూర్తి
1896-1898 సంవత్సరం లో భారత దేశం లో ప్లేగు వ్యాధి సంభవించి చాలా మంది మృత్యువాత పడ్డారు ఆ సమయం లో ఎలా ఉండాలో స్వామి వివేకానంద చెప్పడం జరిగింది ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము ఈ సందర్భం లో స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఒక సారి మనం గుర్తుచేసుకుందాం.


1.మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాము, మీరు బాధపడితే మేము కూడా బాధపడుతాం మీ సంక్షేమం కోసం మేము నిరంతరం ప్రార్థన చేస్తున్నాము, అని అన్నారు. అందుకే మనం ప్రతిరోజు ఉదయం లేవగానే సర్వేజన సుఖినోభవంతు అంటూ   అందరూ క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చెయ్యాలి. ఈ ప్రార్థనకు ఎంతో శక్తి ఉంటుంది.


2. మీ ఇంటిని, మీ చుట్టూ ఉన్న పరిసరాలను నిరంతరం పరిశుభ్రముగా ఉంచుకోండి, అలాగే మీ ఇంటి లో ఉన్న నిల్వ ఉన్న చెడిపోయిన (బేకరీ పదార్థాలు) పదార్థాలను తీసుకోవద్దు అందుకు బదులుగా తాజా గా పుష్టిని ఇచ్చే, శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోండి. బలహీనమైన శరీరం సులభంగా రోగగ్రస్త మవుతుంది.. కాబట్టి శరీరాన్ని దృడంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి.


3. ఈ మహమ్మారి కాలం లో మనం కామ, క్రోధాలకు దూరంగా ఉండండి.


4. వదంతులను నమ్మవద్దు అంటే సోషల్ మీడియా లో వచ్చే విషయాలలో వాస్తవ విషయాలని గ్రహించాలి.


5. బయాల వలన ఆందోళనకు గురి కావద్దని ముందుగా మీకు మేము చేసే   వినయ పూర్వక ప్రార్ధన అందుకు బదులుగా భగవంతుడిపై విశ్వాసంతో ఈ సమస్యను దూరం చెయ్యడం కోసం ఉత్తమమైన మార్గం ఏదో తెలుసుకోవడం కోసం ప్రయత్నించండి. లేకపోతే అదే పని చెయ్యడం కోసం ప్రయత్నిస్తున్న వారితో చేతులు కలపండి..భయం ఆందోళనను మనం దూరంగా ఉంచకపోతే మనకు లేని పోనీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


6.   మనం దేనికి భయపడాలి రండి అర్ధం లేని ఈ భయాన్ని విడిచిపెట్టి భగవంతుడి అనంతమైనన కృపలో నమ్మకం ఉంచి దైర్యంగా ఉండాలి, నడుములు బిగించి కార్యరంగంలోకి దూకుదాం మనం పవిత్రంగా  మానసికంగా శారీరకంగా  శుభ్రంగా ఉంచే జీవితాలను గడుపుదాం భగవంతుడి కరుణతో  ఈ మహమ్మారి  దాని గురుంచి భయం గాలికి ఎగిరిపోతాయి.


7. అవినీతితోను ఇతరులకు హాని చేసేవిధంగా పని చేస్తూ డబ్బు సంపాదించేవారిని భయం ఎప్పటికి వదిలిపెట్టి పోదు కాబట్టి మరణ భయం వెన్నాడుతున్న ఈ రోజులలో ఆ విధమైన ఆవినీతి ధోరణులను విడిచిపెట్టడడం మంచిది.,మనం చక్కనైన ధర్మ మార్గం లో వెళ్ళాలి.


8. మనస్సును ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరుకూడా ఎదో ఒకరోజు మరణించాల్సిందే, పిరికి వారు మరల మరల మరణ బాధలకు లోనవుతుంటారు ఎందుకంటే అది వారి మనసులలోని భయం వల్ల కలుగుతుంది కాబట్టి బయటి పరిస్థితులకు మన హృదయం స్పందించాలి కానీ మన మనస్సు నిర్వీర్యం కాకూడదు.


9. ప్రతి సాయంత్రం మనం భగవంతుని నామ సంకీర్తన చేస్తుండాలి మనం ఇంట్లోనుండే  సాంకేతిక  పరిజ్ఞానం ఆధారంగా మంచి మంచి నామ సంకీర్తనలు చెయ్యాలి అప్పుడు ఇంటిలోని వాతావరణం ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది అప్పుడు భయమనేది మన నుండి దూరం అవుతుంది.


10. ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో వారికి జగన్మాతే రక్షణ ఇస్తుంది. ఆ జగన్మాత మనలను రక్షిస్తుంది అనే భావన తో మనం ఉండాలి. అంటే నిర్భయంగా ఉండాలి.

సేకరణ: ఇమ్మడి రాంబాబు తొర్రూరు 
మనుమసిద్ధి కవన వేదిక ప్రచార కార్యదర్శి. ఉమ్మడి వరంగల్ జిల్లా
మహబూబాబాద్ జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు

0/Post a Comment/Comments