ప్రకృతితో మమేకమౌదాం --మోతుకుల నారాయణ గౌడ్

ప్రకృతితో మమేకమౌదాం --మోతుకుల నారాయణ గౌడ్


ప్రకృతితో మమేకమౌదాం

ప్రకృతి మానవునికి ఓ అద్భుత వరం
పచ్చదనం మనిషికే కాదు సకల జీవరాశుల
సమతుల్యాన్ని కాపాడే జీవవైవిధ్యం
స్వచ్ఛమైన గాలి, నీరు, నేల
సమస్త జీవరాసుల మనుగడకు సూచిక
అమ్మలాంటి తరువులు మనిషికి ప్రాణాధారం
చెడు గాలిని పీల్చి మంచి గాలిని ఇచ్చి
ఏ స్వార్థం లేకుండా మనిషికి సహకారం అందిస్తూ
ప్రేమను పంచుతాయి
భూతాపాన్ని తగ్గించాలన్నా
వర్షాలు కురిసి పంట పొలాలన్ని సస్యశ్యామలం కావాలన్నా ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ పరిఢవిల్లాలన్న
మనిషి తన వంతు బాధ్యతగా  పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి
అడవుల్ని కాపాడుకుంటూ మొక్కలతో ప్రకృతిని నింపేయాలి
పచ్చని చీర కట్టి అడివమ్మ భవిష్యత్ తరాలను తన బడిలో సేద తీరుస్తుంది
సమస్త మానవాళికి మేలు చేసే చెట్ల  ఋణం తలక్రిందులుగా తపస్సు చేసినా తీర్చలేం మనిషికొక మొక్క
ఇంటికో ఇంకుడుగుంత ఊరురా వనం
కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా
పర్యావరణ సమతులనం చేస్తూ
పరస్పర సహకారంతో పంచభూతాల సమన్వయం
జరిగి భూమండలం  మానవాళి మనుగడకు ఉనికికి అద్భుతమైన నేస్తమౌతుంది

                  మోతుకుల నారాయణ గౌడ్
                  ప్రిన్సిపల్ (FAC)
                  TS మోడల్ స్కూల్ వీర్నపల్లి.
                  రాజన్న సిరిసిల్ల జిల్లా

0/Post a Comment/Comments