"సాహితీ ముత్యాల హారం" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం-అభినందనలతో ప్రవాహిని 💐💐💐

"సాహితీ ముత్యాల హారం" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం-అభినందనలతో ప్రవాహిని 💐💐💐

"సాహితీ ముత్యాల హారం" పురస్కారం  గద్వాల సోమన్నకు ప్రదానం
---------------------------------------
పెద్దకడబూరు మండలంలోని, హిస్సారమురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్న, ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త గద్వాల సోమన్నను 'సాహితీ ముత్యాల హారం' పురస్కారం వరించింది.బాలసాహిత్యంలో  పలు పుస్తకాలు వ్రాసి,ముద్రించడమే కాకుండా,బాలలచే రచనలు చేయిస్తూ, 'పసి(డి) హృదయాలు ' బాలసాహిత్య వేదికను ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు.ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న ఖాతాలో మరొక అవార్డు జమ కావడం విశేషం.శ్రీ రాథోడ్ శ్రావణ్ గారు రూపొందించిన ముత్యాల హారాలు నూతన తెలుగు లఘు వచన కవితాప్రక్రియలో శతాధిక మినీ గేయకవితలు అనతి కాలంలో వ్రాసినందుకుగాను ఉట్నూర్  సాహితీ వేదిక,ఆదిలాబాద్,తెలంగాణ రాష్ట్రం వారు కరోనా దృష్ట్యా  "సాహితీ ముత్యాల హారం" పురస్కారమును సోమన్నకు  వాట్సప్ గ్రూప్ ద్వారా అందజేశారు.అవార్డు గ్రహీత గద్వాల సోమన్నకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు,తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు,శ్రేయోభిలాషులందరూ అభినందనలు తెలిపారు.

0/Post a Comment/Comments