చిలక జోస్యం....(హాస్య కవిత)... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

చిలక జోస్యం....(హాస్య కవిత)... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

చిలక జోస్యం....(హాస్య కవిత)

ఈ కరోనా కాలంలో
రోజు ఎండలో తిరగక 
వ్యాయామం యోగ ధ్యానం చేయక
ఇమ్యూనిటీని పెంచుకోని
బద్దకస్తులకు ఈ భూమిపై "నూకలు"
చెల్లినట్లేనంటోంది...చెట్టుకింద...రామచిలక

ఈ కరోనా కాలంలో
రోజు శానిటైజర్ తో చేతులు
శుభ్రంచేసుకోని సోమరుల"ఆత్మ" పరమాత్మలో
లీనమైనట్లేనంటోంది...చెట్టుకింద...రామచిలక

ఈ కరోనా కాలంలో
హాల్స్ లో మాల్స్ లో ‌‌సభల్లో
సమావేశాల్లో భౌతిక దూరాన్ని
పాటించనివారికి "స్మశానం" స్వాగతం
పలికినట్లేనంటోంది...చెట్టుకింద...చిలక

ఈ కరోనా కాలంలో
ముఖానికి డబుల్ మాస్కు లేక
సానుకూలంగా ఆలోచించక అతిగా
భయపడే ఆందోళన చెందేవారి"నీడ" 
వారికి దూరమైనట్లేనంటోంది...చెట్టుకింద...రామచిలక

ఈ కరోనా కాలంలో
మందుషాపులముందరే
మందెక్కువై మందిలో దూరి
చిందులేసే మందుబాబులను
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి
రోడ్లమీద విచ్చలవిడిగా వీరంగం చేస్తు
ఊరంతా ఊరేగే తిరుగుబోతులను
కరోనా "కాలనాగు" కాటేసినట్లేనంటోంది...
వారిముందు
"మృత్యువు" నృత్యం చేసినట్టేనంటోంది...
"కాటికి వారి పయనం"
ఖాయమైనట్లేనంటోంది...చెట్టుకింద...రామచిలక

ఔను మొక్కేకదాని...పీకేస్తే
"పీకలు" ఎగిరిపోతాయ్ ! అది నిన్నటి మాట !
కానీ చెప్పింది "రామచిలకే"కదా...నిర్లక్ష్యం వహిస్తే
బ్రతుకులో "నిప్పులు" కురుస్తాయ్ ! ఇది నేటి హెచ్చరిక !


రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502


 

0/Post a Comment/Comments