ఇతిహాస సంపద ---యస్ యస్ ఆర్ (సంకెపల్లి శ్రీని వా స రెడ్డి)

ఇతిహాస సంపద ---యస్ యస్ ఆర్ (సంకెపల్లి శ్రీని వా స రెడ్డి)


ఇతిహాస సంపద
-------------యస్ యస్ ఆర్ 

అన్నదమ్ముల అనుబందానికి ఆలవాలం రామాయణం
తండ్రి మాటే వేద వాక్కు అనుటకు నిదర్శనము రామాయణం
భార్యాభర్తల  ప్రేమ కు ప్రతి రూపం రామాయణం
ఇక్ష్వాకు వంశ కీర్తి ప్రతిష్టలకు చిహ్నం  రామాయణం

అహంకారం అణచివేత కొరకు మాహా భారతం 
చెడు పై మంచి చేసే పోరాటం మహాభారత ము
దుర్మార్గం లను నిర్ములించుట కొరకు  మహాభారతం
రాజ్యకాంక్ష కొరకు  రణం చేసే వారికి బుద్ధి చెప్పేదే   మాహాభారతం
పుత్ర వాత్శల్యాని కి ఫలితం మహాభారతం
కుట్రలు,కుతంత్రాలకు వేదిక మహాభారతం
స్త్రీ  పరాభవం ఫలితం మహాభారతం
నమ్మక ద్రోహం ప్రతిబింబించినది మహాభారతం
కక్ష్య లు, కారపన్యా లకు నిలయం మహాభారతం
అన్నిటిని మించి భగవంతుని తీర్పు మహాభారతం

భగవంతుని లీలలు భాగవతం 
భగవంతుని జీవితం భాగవతం
శ్రీకృష్ణుని మాయ లకు వేదిక భాగవతం
జగత్ గురువు అవతార విశేషాలే భాగవతం
భగవంతుని బోధనలే భగవద్గీత
దేవుని ధర్మ ప్రబోధ మే భగవద్గీత
పాప,పున్యాల ఫలితం తెలిపీదే భగవద్గీత 
విధినిర్వహనను సూచించేదే భగవద్గీత 

అందుకే రామాయణం, మాహాభారతం, 
భాగవతం భగవద్గీత లు మ న ఇతిహాస సంపదలు 
అందుకే అవి జీవనయానానికి మార్గదర్శి కలు
              
రచన 
సంకెపల్లి శ్రీని వా స రెడ్డి
రాష్ట్ర అధ్యక్షుడు 
తెలంగాణ(కాకతీయ)ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీపీసీయల్ ఏ)
బ్యాంక్ కాలని, మహబూబాబాద్.

0/Post a Comment/Comments