మార్గం నిజాలు - మార్గం కృష్ణమూర్తి

మార్గం నిజాలు - మార్గం కృష్ణమూర్తి


- మార్గం కృష్ణమూర్తి

మార్గం నిజాలు


01.
గుర్రానికి ఆకలయితే
గడ్డినైనా మేయదా?
అవసరం ఏర్పడుతే
ఏదో  పని చేయదా?

02.
పని చేయలేకుంటే
పెళ్ళిచేయడమెందుకు?
పోషించలేకుంటే
పిల్లల కనుట ఎందుకు?

03.
ఓటు వేయడమే
నేరమా ఏమిటి?
అధికారం వచ్చాక
పట్టించు కోరేమిటి?

04.
గొప్ప వాండ్లు కోట్లు
తిన్నా నేరం కాదా?
అధికారుల అలక్ష్యం
నేరమే కాదా?

05.
పేద వారైతే
కుర్చిలొ కూర్చోనివ్వరా?
ధనవంతులైతేనే
కుర్చిలొ కూర్చోనిస్తరా?

06.
కల్లు త్రాగుతేనే
ఆరోగ్యం పాడవుతుందా?
బ్రాండి విస్కి త్రాగుతే
ఆరోగ్యం పాడవదా?

07.
భార్యా భర్త లిరువురు
ఒంటరిగ ఉండాలా?
అత్త వస్తున్నదని
భయపడి పోవాలా?

08.
తొలి ఏకాదశి రోజు
ఉపవాసం ఎందుకు?
ఇంట్లో నలుగురున్నారు
నలుగురూ ఎందుకు?

09.
గుడికి పోయినపుడు
దిక్కులు చూడటమెందుకు?
దేవుడికి మొక్కేటపుడు
మాట్లాడటమెందుకు?

10.
దానం చేయలేని
చేతులు ఉండి ఎందుకు?
గుడికి వెళ్ళలేని
కాళ్ళు ఉండి ఎందుకు?

11.
ఉద్యోగం లేకుంటే
పెళ్ళిళ్ళు ఎందుకు?
పోషించ లేకుంటే
పిల్లల కడనడమెందుకు?

12.
బయటకు వెలుతే
కరోనా ఉంది కదా!
ఇంట్లోనే ఉండి
చదువు కోవచ్చు కదా!

13.
భార్య భర్తల మధ్య
ఆడ బిడ్డ ఎందుకు?
అన్నా వదినల మధ్య
తోటి కోడలు ఎందుకు?

14.
కాయ గూరలు తిని
బ్రతకడం కష్టమా?
పాలు, జ్యూసుల తాగి
జీవించ లేమా?

15.
షేర్ మార్కెట్ తగ్గితే
మల్లీ పెరుగదా?
బంగారం ధర పెరుగుతే
మల్లీ తగ్గదా?

16.
గట్టిగా అరుస్తే
పనులు అవుతాయా?
అసలే అరువకపోతే
పనులు ఆగుతాయా?

17.
కొండలకు మొక్కుతే
పాపాలు పోతాయా?
పూజలు చేస్తే
కష్టాలు తీరుతాయా?

18.
పన్నులు కట్టకుంటే
ఫైనులు వేస్తారా?
పన్నులను కడుతే
అభివృద్ధి చేస్తారా?

19.
గోదావరి పుష్కరాలకు
పోవటము ఎందుకు?
మరి కొంత కాలానికి
పాపాలుచేయటమెందుకు?

20.
బాగా చదువు కున్నాక
భయపడటమెందుకు?
పరీక్ష వ్రాసి వచ్చాక
ఆలోచించడమెందుకు?

- మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments