మన ఆరోగ్యం-మన స్నానం ఈ మధ్యన మన ఆహారం (వ్యాసం) .బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర కర్నూలు జిల్లా .

మన ఆరోగ్యం-మన స్నానం ఈ మధ్యన మన ఆహారం (వ్యాసం) .బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర కర్నూలు జిల్లా .

మన ఆరోగ్యం-మన స్నానం
 మధ్యన మన ఆహారం (వ్యాసం)
--------------------------------------------

మన ఆరోగ్య విషయంలో స్నానానికి ఉన్న ప్రాధాన్యత ఇంతో అంతో కాదు. అసలు స్నానం ఎలా చేయాలి? ఆ చేసే స్నానాలు ఎన్ని రకాలు, వాటిని అమలు చేసే విధానాలను నిత్యం స్నానం చేసే మీరు ఎప్పుడైనా నా ఆలోచించారా? స్నానం చేయడమంటే, ఏదో హడావిడిగా నాలుగైదు చెంబులు ఒంటిపై పోసుకొనడం కాదు. కొందరు తమ శరీరం పూర్తిగా కలవకుండానే అయ్యిందా అని పిలుస్తారు. అలా అలా మన విధిని స్నానం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాము.

         మన స్నానానికి కనీసం అరగంటైనా సమయం కేటాయించాలి. మొదలు నాలుగైదు చెంబులతో నీళ్లను శరీర భాగాలు తడిసేలా పోసుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో శరీరాన్ని శుభ్రంగా రుద్దుకోవాలి. (ఇప్పుడు సున్నిపిండి ఎవరు పెడుతున్నారు అండి తీరైన సబ్బులను వాడుతున్నారు). కాళ్ల పాదాల నుండి శిరస్సు వరకు శుభ్రంగా రుద్దుకొని స్నానాన్ని పూర్తిచేయాలి.
అనంతరం శరీరంలో  మన అవయవాలను శుభ్రంగా తుడుచుకో కపోవడం వల్ల అనేక రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. మర్మాంగాల వద్ద సరైన గాలి తగలక పోవడం వల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. స్నానానంతరం ఫ్యాన్ కింద ఓ రెండు నిమిషాలు నిల్చోని ఆ తర్వాత దుస్తులు ధరించాలి. పురుషులు నగ్నంగా స్నానం చేయరాదు రాదు. ఏదో ఒక గుడ్డ చుట్టుకొని చేయాలి. స్త్రీలు మాత్రం తమ ఒంటి మీద  ఏమి లేకుండానే స్నానం చేయాలి.

తెల్లవారుజామున 4   to 5 గంటల మధ్య స్నానం చేస్తే ఆరోగ్యదాయకం. ఈ కాలం మధ్యన ఈ కాలం ఈ మధ్యన చేసే స్నానానికి ఋషి స్నానము అని పేరు. ఉదయం 5 నుండి6 గంటల మధ్య చేసేది దైవ స్నానము.6నుండి7 గంటల మధ్య చేసేది మానవ స్నానము. ఆపైన చేసేది రాక్షస స్నానం. చన్నీటితో స్నానం గావించడం ఆరోగ్యదాయకం. నదీ స్నానం ఉత్తమోత్తమమైనది. చెరువు స్నానం మధ్యమము. నూతి స్నానం అధమం. మన వీటిలో చేసే స్నానం అతి వేడి నీటితో గాని, అతి చల్లని నీటితో కానీ చేయక గోరువెచ్చని నీటితో చేయడం ఉత్తమం. శరీరం లోపలి అవయవాల కు ఎంతో స్వాంతనం కలుగుతుంది. స్నానం ఒక పని కాదు. అది ఒక మన జీవన భావన భువన సంజీవిని యోగం. మానవ భోగం. 

ఇక ఆహార విషయానికొస్తే, భోజనం ఎలా చేయాలో ముందుగా తెలుసుకోవాలి. రోజుకు రెండు సార్లు మాత్రమే భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణ్యం చెబుతుంది. ఈ రెండు సార్లు మధ్యలో ఏమి తీసుకోకపోతే ఉపవాస ఫలితం కూడా మనకు దక్కుతుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకు తిరిగి చేయాలి. తూర్పు వైపుకు తిరిగి చేయడం వల్ల ఆయుర్దాయము పెరుగుతుంది. దక్షిణానికి తిరిగి చేస్తే కీర్తి కలుగుతుంది. ఉత్తరం వైపు తిరిగి చేస్తే మన మనసులోని కోరికలు తీరుతాయి. పడమర, దక్షిణం వైపు కూర్చొని భోజనం చేయరాదని వామన పురాణం, విష్ణు పురాణం లోను ఉంది. కావున నిత్యం మనం తూర్పు వైపు తిరిగి భోజనం చేయడం అనేది అన్ని శాస్త్రాలు ధర్మాలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. 

ఆకుల మీద, ఇనుప పీటలమీద కూర్చొని భోజనం చేయరాదు. ధనాన్ని ఆశించేవారు మర్రి, జిల్లేడు, రావి, తమ్మి, కానుగు ఆకుల్లో భోజనం చేయాలి. మోదుగ, తామర అ ఆకుల్లో సన్యాసుల మాత్రమే భోజనం చేయాలి. భోజనానికి ముందూ తర్వాత ఆచమనం చేయాలి. తినేముందు అన్నపూర్ణకు నమస్కరించి మొదటి ముద్దను ప్రసాదముగా స్వీకరించి ఆ తర్వాత భోజనం పూర్తయ్యేలా చూసుకోవాలి. గ్రహణం రోజున అనగా సూర్యగ్రహానికి 12 గంటలు ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి 9:00 ముందుగా ఎలాంటి ఆహారం భుజించరాదు. బుజ్జి ఉంచడానికి ఎడమ చేయి ఉపయోగించరాదు. ముఖ్యంగా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారం అమృతం తో సమానము.

కాబట్టి  మనం మన ఆరోగ్య విషయంలో లో పై తగు జాగ్రత్తలు అన్ని సమయానుకూలంగా తీసుకుంటూ నిత్యం స్నానమాచరిస్తే అనారోగ్యం మన దరిచేరదు మన ఆరోగ్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణం శతవార్షికం వైపు పరుగులు పెడుతుందనుటలో అతిశయోక్తి లేదు. కావునా నిత్యం ఆచరిద్దాం ఆనందం పొంది అనునిత్యం తరిద్దాం.

గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments