గాలి వీచింది,చల్లగా..!(కవిత)
గాలి వీచింది
చెట్టు కింద చల్లగా..,
పువ్వు పూసింది,
మెలమెల్లగా..!
కోయిల కూసింది,తీయని
రాగంతో..!
మది బాధనంతా మర్చింది,
చక్కని ప్రకృతి
పారవశ్యంతో..!!
మధురమైన గానంతో, తుమ్మెదల కోలాహలం,
సీతా కోక చిలుకల
విహరింపుల ఆనంద
మయ జీవితం..!!
ఆ వైపున..
తెల్లని కొంగలు..
గుంపులు గుంపులు..!
ఆ చిలుకా గోరింకల సయ్యాటలు..!
చెట్టు చుట్టూ..
పచ్చని పొలాలు..!
పొలాల చుట్టూ..
గడ్డి మేస్తున్న
గొఱ్ఱెల మంద..!
ఆ దూర దూరాన ఎత్తయిన
కొండలు, అడవులు...!
ఆ కుందేళ్ళ పరుగులు..!
ఆ నెమళ్ళ ఉరుకులు..!
చెట్టు కింద ప్రకృతి ఇంత
అందంగా దర్శన మిస్తుందని
ఊహించలేకున్నాను...!
చూస్తూ అలా నిలబడిపోయాను..నేను.
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా,తెలంగాణ.