స్నేహపు మధురిమలు --పిల్లి.హజరత్తయ్య

స్నేహపు మధురిమలు --పిల్లి.హజరత్తయ్య


స్నేహపు మధురిమలు

ఉషోదయపు ఉషస్సులా
స్వార్ధ మెరుగని పవిత్రబంధం
హిమాలయ శిఖరపు యశస్సులా
ఈర్ష్య పడని అనుబంధం..!

పవిత్రమైన గంగా జలంలా
త్యాగనిరతికి ప్రతీక మైత్రిబంధం
స్వచ్ఛమైన మంచులా
అరమరకలు లేనిది స్నేహబంధం..!

కోకిల గానంలా,నెమలి నాట్యంలా
తేనే తీయదనములా,మానవతతో మెరిసేది

వయసుతో సంబంధం లేకుండా 
పువ్వులాగ విరబూయునది
ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోనిది
ఈ లోకంలో మహోన్నతమైనది..!

స్నేహపు మధురిమలు 
జీవితాంతము నీడలా వెంటాడుతూ
మధుర భావాలను మీటి 
మనసనే వీణను పులకింపజేస్తుంది..!

ముత్యపు చిప్పలో పడిన నీటిబిందువు ముత్యమైనట్లు
మంచిస్నేహితుడు సాంగత్యం దొరికితే
మనిషి ఉజ్వలంగా వెలుగుతాడు.!

పిల్లి.హజరత్తయ్య, శింగరాయకొండ


0/Post a Comment/Comments