ఔను ఇది నిజమేనులే... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఔను ఇది నిజమేనులే... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఔను ఇది నిజమేనులే...

వెలిగినంత
సేపు చిరుదీపం
వెలుగులు విరజిమ్మేనులే...
చిమ్మచీకటిని తరిమేనులే...
ఆపై ఆరిపోయి తిరిగి
ఆ చీకటిఒడిలో చేరేనులే...

ఇది నిజమేనులే...
లేవయసులో ఒళ్ళంతా కులుకేనులే...
వయసు కరిగిన అందం తరిగిన
విధి జీవితాన విషాదం చిలికేనులే...

ఇది నిజమేనులే...
జీవితమంటే చీకటి వెలుగేనులే...
తెలుపు నలుపేనులే....ఓటమి గెలుపేనులే

ఇది నిజమేనులే...
మిడిమిడిఙ్ఞానంతో
పడిలేస్తూ ప్రతిరోజు పరుగేనులే...
మిడిసిమిడిసి పడేది మిణుగురు పురుగేనులే...
ఆపైమిగిలింది ఆపరమాత్మ ఆఖరి పిలుపేనులే...

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502 

0/Post a Comment/Comments