హనుమజ్జయంతి (ఆటవెలది పద్యాలు)

హనుమజ్జయంతి (ఆటవెలది పద్యాలు)


1. రామనామమనిన రంజిల్లుతనమది
     పరవశమ్మునొందు పవనసుతుడు
     అంజనీసుతుండు అవనిజకుహితుడు
     భక్తితోడగొలువ శక్తినిచ్చు

2. ప్రణతులిడుదునీకు పవనసుతహనుమ
     దీనజనులగాచి దీవెనిచ్చి
     కరుణజూపుమయ్య కఠినమౌకాలంబు
     ఆంజనేయమాకు అభయమొసగు

3. నీదునామమెపుడు నిరతముమదిలోన
    పఠనజేసినంత ఫలితమిచ్చి
    దుష్టశిక్షణమ్ము శిష్టరక్షణజేయు
    రక్షనీవెమాకు రామభక్త

4. జయముజయమునీకు జయమగుహనుమంత
    వందనములునీకు వాయుపుత్ర
    రోమరోమమందు రామనామమెనీకు
    ఆదుకొనగరమ్ము యాంజనేయ

5. శుభములొసగుతండ్రి శ్రీకరముగవేడ
     భక్తితోడనిన్ను భజనచేయ
     పానకంబువడలు ప్రేమమీరనిడుదు
     రామభక్తహనుమ రక్షనిడుము

6. కొండగట్టునందు కొలువుదీరెహనుమ
    కోరికలను దీర్చు కొలిచినంత
    పంచముఖుడతడు పరమదయాళుండు
    అలరెభువినిజూడ హనుమ భక్తి

                        తాళ్లపల్లి భాగ్యలక్ష్మి(టీచర్),
                        MA (తెలుగు),M.Ed,UGC(NET)
                          రాజన్న సిరిసిల్ల జిల్లా,
                          Ph: 9490183850

0/Post a Comment/Comments