కథ:మార్పు శ్రీమతి సత్య మొం డ్రెటి

కథ:మార్పు శ్రీమతి సత్య మొం డ్రెటి

కల్నల్ కిరణ్ తే జ  డెహ్రాడూన్ క్యాంప్ ఆఫీస్ లో జండా ఎగరవేస్తున్నాడు. అశేష భారత సైనికులు తమ జాతీయ పతాకం కు వినమ్రులై వందనం చేస్తున్నారు. కిరణ్ తన సహ సైనికుల్ని చూసి ఎంతో గర్వం తో ఎగురుతున్న జెండా వైపు చూస్తూ తనను తాను మైమరచి పోయాడు. ఎక్కడ తను.... రెపరెప లాడుతున్న జాతీయ జెండా.. కిరణ్ ని గతం లోకి  తీసుకెళ్ళింది.
*     *     *

కిరణ్ ఒక మద్య తరగతి  కుటుంబం లో పుట్టి పెరిగాడు.తల్లిదండ్రులు సంప్రదాయ బద్దులు. ముగ్గురు అన్నదమ్ముల్లో చివరివాడు కిరణ్.. పదవ తరగతి వరకు చదువు లో చాలా చురుకుగా వుండేవాడు. పది తర్వాత స్నేహితులతో కలసి చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. తల్లిదండ్రుల మాట కు ఎదురు తిరిగే వాడు. వాళ్ళని  మానసికంగా  చాలా హింసించేవవాడు. చివరకు కొడుకు మీద ఆశ వదులుకున్నారు వారు. కిరణ్ స్నేహ బృందం ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఊరిలో అమ్మాయిలను టీజ్ చేయటం, తాగి తంద నాలాడటం ..పబ్లిక్ ని డిస్టర్బ్ చేయటం వాళ్ళ పని. ఒకరోజు స్కూల్ టీచర్ రోడ్డు మీద నడుస్తూ వెళుతుంటే ..ఆమె జడ లోని పూవు ని రాయి విసిరి కింద పడేయాలని కిరణ్ కి పందెం పెట్టారు. కిరణ్ రాయి తీసుకుని విసురుగా ఆమె తల పైకి విసిరాడు. అది గురితప్పి ఆమె నుదుటికి తగిలి రక్తం కారసాగింది. ఫ్రెండ్స్ ఏ మాత్రం ఫీలవకుండ వెకిలి గా నవ్వుతున్నారు. ఆమె దెబ్బ తో  అలానే వాళ్ళ దగ్గరికి వచ్చి, నవ్వు తూ కిరణ్ తో పేరు  వివరాలు అడిగి తెలుసుకుంది. మర్నాడు కిరణ్ ఫ్యామిలీ ని  ఇండిపెండెన్స్ డే సెబ్రేషన్స్ కి  ఇన్వైట్ చేసింది. ఏ కళ నున్నాడో  కిరణ్, ఫ్యామిలీ తో స్కూల్ కి వెళ్లారు. కొట్టినందుకు నా మీద కంప్లైంట్ ఇస్తుంది అనుకున్న కిరణ్  ఆమెను  ఆసక్తి తో చూస్తున్నాడు. ఆమె తన సహ టీచర్స్ కి ప్రిన్సిపాల్ కి  వాళ్ళని  పరిచయం చేసింది. తర్వాత మన దేశం గురించిన గొప్పతనం గురించి వివరించారు. టీచర్స్ దేశం కోసం ఎందరో మహాను భావులు తమ జీవితాలను త్యాగం చేశారని... వాళ్ళ త్యాగ ఫలితమే మనం నేడు స్వేచ్ఛా జీవితం గడపగలుగు తున్నా మని .. దేశం కోసం తమ స్వార్థం  లేకుండా త్యాగం చేసిన వారే నిజమైన దేశభక్తులు. కన్న తల్లి కంటే కూడా దేశం గొప్పది.అలాంటి కర్మభూమి భారత దేశం లో పుట్టటం మన అదష్టం. అంటూ ముగించారు... టీచర్ కిరణ్ దగ్గరగా వచ్చి కిరణ్ నీ   ఆమెతో  తీసుకెళ్ళి  కిరణ్ తో జాతీయపతాకాన్ని ఎగర వేయమన్నారు. కిరణ్ అవాక్కయ్యాడు. తనను కావాలని  ఎగతాళి చేస్తోంది. నేనేంటి?జండా అగరవేయటమేమిటి? విస్తుబోయి చూస్తున్నాడు కిరణ్. 

కొంతమంది టీచర్స్ అభ్యంతరం చెప్పారు. అయినా ఆమె పట్టుదల తో కిరణ్ తోనే జండవందనం చేయించింది. ఈ దేశం లో పుట్టిన ఏ వ్యక్తి జన్మతః చెడ్డవాడు కాదని పరిస్థితులు పరిచయాలు  చెడు ని ప్రేరేపిస్తాయి అని కిరణ్ ని మంచి మార్గం లో పెట్టిన మహోన్నత వ్యక్తి ఆమె. ఆమె నేర్పిన దేశభక్తి తో సైన్యం లో చేరి కిరణ్ కల్నల్ స్థాయికి వచ్చాడు. దేశం మనకేమిచిందని కాకుండా దేశానికి మనం ఏం ఇచ్చా మని ఆలోచించాలి మనం.

సర్ అన్న సైనికుల పిలుపుతో  గతం నుండి వాస్తవం లోకి వచ్చాడు కిరణ్.

పేరు: సత్య మొండ్రేటి
ఊరు: హైదరాబాద్
చరవాణి:9490239581

0/Post a Comment/Comments