శీర్షిక :మత సామరస్యము ‍ సత్య మొం డ్రెటి

శీర్షిక :మత సామరస్యము ‍ సత్య మొం డ్రెటి


భారత దేశ పౌరులా రా
సమత మమత కు మారు రూపులారా...
మన దేశము మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం...
హిందూ ముస్లిం భాయి భాయి
లేదు మనకు కుల మత ద్వేషాలు
మతమంటే అనుసరణ మార్గం
అన్ని మతాల సారం మానవత
మానవత్వమే మన మతం
ఏ మతమైనా ప్రబోధించే ది మానవతనే
రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం మత కల్లోలాల తో విధ్వంసాలు సృష్టించి..
మనసులను సంకుచిత భావాలతో ప్రేరేపిస్తున్నారు....
భారత ప్రజలంతా ఒకే మతం భారతీయతే వారి మతం
దేశ ఔన్నత్యామే వారి లక్ష్యం
ఏ మతమైనా ఏ కులమైన మనుషులంతా కలసి ఒకరికొకరు నేనున్నా అన్న ఆశయంతో ఆర్తితో సహాయ సహకారాలు అందిం చుకుంటూ ఉన్నారు
పంచభూతాలకు లేదు మతం
మనిషి ఆశించే కరెన్సీకి లేదు మతం
నారాయణ నారాయణ అల్లా అల్లా మేమంతా నీ పిల్లలమయ్యా అంటూ  మతసహకారంతో మనుషులు 
కలిసిమెలిసి ఉంటున్నారు.. హిందువుల మందిరంలో ముస్లింలు సిక్కులు జైనులు వాళ్ల మందిరంలో హిందువులు ఒకరి పండుగలను ఒకరు ఎంతో అన్యోన్యంగా జరుపుకుంటున్నారు సోదర భావంతో సౌభ్రాతృత్వం తో
ఐకమత్యంతో ఉన్నారు మతసామరస్యం తో దేశానికి వన్నె తెచ్చిన విభిన్న మతస్థులు.... భిన్నత్వంలో ఏకత్వం గా ఎవరి మత నియమాలువారు పాటిస్తూ...
శాంతియుతంగా జీవిస్తున్నారు...... మానవత్వమే మన అందరి మతం.......


పేరు:శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్
చరవాణి 94 90 2 3 95 81
ప్రక్రియ: వచనం

0/Post a Comment/Comments