సాహిత్య కెరటం ---యస్ యస్ ఆర్ (సంకెపల్లి శ్రీనివాసరెడ్డి).

సాహిత్య కెరటం ---యస్ యస్ ఆర్ (సంకెపల్లి శ్రీనివాసరెడ్డి).

సాహిత్య కెరటం 
---యస్ యస్ ఆర్ 

అతను తెలుగు సాహిత్య సమరాంకురం 
అతడు తెలుగు సాహిత్య సాగరకెరటం 
కార్మికుల, కర్షకుల రక్తం ఖర్చులను 
రీక్షవాల, రైతు కూ లీల చెమట విలువను గూర్చి 
సాహితీ రణం చేసిన మహాకవి 
బడుగుల గూర్చి , బలహీను ల 
గూర్చిపోరాడిన ప్రజాకవి 
పల్లె, పట్నం, ధనిక, బీద 
తార తమ్యా లపై  గళం విప్పిన గొప్ప కవి 

బలవంతుల దౌర్జన్యాలను 
బలవంతులు పన్నాగాలు 
ఇకనా చెల్లవు,ఇక నా సాగవు 
అని నినదించిన సాహస కవి

పండితుడై నా, పామరుడైనా
పెడవాడైనా, ధనవంతుడైనా
న్యాయం ముందు సమాను లే 
అనిఎలిగెత్తిన జ్ఞాన కవి .

దళితుల అస్తిత్వం కోసం 
తహ తహలాడిన ఆదర్శ కవి 
ప్రజాస్వామ్యం, సామ్యవాదం 
ఫలాలు సమానంగా అందాలని 
చాటి చెప్పిన మానవ తావాద కవి

ప్రణయం, విరహం
రెందింటిని తాకిన ఆశవాద కవి 
అభ్యుదయం నామార్గ మని 
అనునిత్యం తపించి న ఆరటకవి

పల్లె నుంచి పట్నం తాకిన సుప్రసిద్ధ కవి 
హక్కుల కోసం విప్లవాన్ని  సైతం ఆహ్వానించిన విప్లవకవి 
ప్రపంచంము బాదే తన బాధ అనుకొన్న విశాల హృదయకవి

ఈసాహితీ లోకం మ రవదు ఎన్నటికి నిన్ను 
మీ  కివే మా సాహితీ ప్రణామ ములు 

రచన 
---యస్ యస్ ఆర్ (సంకెపల్లి శ్రీనివాసరెడ్డి), 
యమ్ యస్ సి,యమ్ ఏ,యమ్.ఫీల్,యమ్.ఎడ్., 
లెక్చరర్, కవి మరియు రచయిత,
రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ (కాకతీయ)ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీపీసీయల్ ఏ) 


.

0/Post a Comment/Comments