భారత దేశ ఔన్నత్యం --- మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్.

భారత దేశ ఔన్నత్యం --- మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్.

భారత దేశ ఔన్నత్యం

నా దేశం భగవద్గీత!
నా దేశం భరత మాత!
నా దేశం పవిత్ర గోమాత!
నా దేశం ననుగన్న మాత!

వేద ఉపనిషత్తులకు పుట్టినిల్లు
విదేశీ వలసదారులకు మెట్టినిల్లు
ఆధ్యాత్మికతభావాలు పరిఢవిల్లు
ఆచార సాంప్రదాయాలకు  హరివిల్లు
ఆధరణ ఆత్మాభిమానాలకు లోగిళ్ళు

ప్రేమానురాగాలు, ఐక్యతకు నెలవు
సాహిత్యానికి , కళాకారులకు నెలవు
తపో రుషులకు, త్యాగధనులకు నెలవు
వీరులకు , కార్యధీక్షకులకు నెలవు

నా భారత దేశ హృదయం ఎంతో విశాలం
ఎవరినైనా అక్కున  చేర్చుకునే సుగుణం
ఏ దేశానికైనా సహాయం చేసే మానవత్వం
ఆపన్నులను ఆదుకునే దయార్ధ హృదయం
ఎల్లప్పుడూ శాంతిని  కోరుకునే మనస్థత్వం

తూర్పున పొడువైన బంగాళాఖాతం
పశ్చిమాన అరేబియా మహాసముద్రం
దక్షణాన  హిందూ మహా సముద్రం
ఉత్తరాన ఎత్తైన శిఖరం, హిమపర్వతం

గంగా గోదావరి జల వనరులు 
పండిత పామర మానవ వనరులు
అడవులు భూములు , వృక్షసంపదలు
వజ్ర వైడూర్యాలు మణులు మాణిక్యాలు
ఇత్తడి రాగి ఇనుము , బంగారు ఘనులు
అంతులేని,సిరు సంపదలకు చిరునామాలు

ప్రపంచంలో కెల్ల పెద్ద రాజ్యాంగం
కుల మత ప్రాంతాలకు లేదు భేదం
అన్ని మతాల వారు జీవించగల దేశం
ప్రతి ఒక్కరికీ ఉంది స్వేచ్ఛా స్వాతంత్ర్యం
శాస్త్ర సాంకేతిక రంగాలలో ఘనవిజయం
వ్యవసాయం ఆర్ధిక రంగాలలో పరిపుష్టం
వాయు జల మిలిటరీ సేనలు భీకరం
భారత దేశ  ఔన్యత్యం  విశ్వజనీనం
నాదేశం సకల దేశాలకు పుణ్య భూమి


--- మార్గం కృష్ణమూర్తి,
హైదరాబాద్.


0/Post a Comment/Comments