మనసా...! పేరు: కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), ఖమ్మం.

మనసా...! పేరు: కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), ఖమ్మం.

 

మనసా...!

పేరు: కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), ఖమ్మం.


పల్లవి:
మనసా...! మనసా...!
ఒక్కసారి వచ్చి పోవా మనసా
తనివితీర పలికిపోవా మనసా
మదినిండిన భావాలను మురిపెంగ తడిమి పోవా మనసా మనసా...   //మనసా//

చరణం:1
ఊహాలకే రెక్కలు కట్టి
ఊపిరిలే బిగ బట్టీ
ఊరినంత కలియ తిరిగి
ఊడలతో ఉయ్యాలలూగి
తాటి చెట్టు,ఈత చెట్టు
పొలం గట్టు,మైసమ్మ మెట్టు
ఊరవాడ పలకరిద్దామ మనసా... మనసా...//మనసా//

చరణం:2
పైటేసిన పైరు అందం
కాళ్ళ పారాణి చంద్ర బింబం
నాగలితో రైతన్న నడక
పాద ధూళిలో వృషభ రాజసం
గలగల పారే సెలయేరు 
శిశిరం లో చందమామ
పల్లెలు కనువిందు కదా మనసా... మనసా...//మనసా//

చరణం:3
పాకాల సరసు  సొగసులు
పాలపిట్టల వరుస పరుగులు
పాలబుగ్గల పసిడి మనసులు
వాన చినుకులతొ చిలిపి చేష్టలు
చిర్రగొనే చేడుగుడాటలు
అష్ట చెమ్మ పచ్చీసాటలు
బాల్య స్మృతుల సవ్వడే కద మనసా... మనసా...//మనసా//

(ప్రక్రియ:గేయం)


0/Post a Comment/Comments