1️⃣3️⃣ జీవిత పాఠాలు నీవు నిత్యం నేర్పించు ఇలా.... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

1️⃣3️⃣ జీవిత పాఠాలు నీవు నిత్యం నేర్పించు ఇలా.... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

1️⃣3️⃣ జీవిత పాఠాలు  
నీవు నిత్యం నేర్పించు ఇలా....  


0️⃣1️⃣
నీ శిరస్సుకు... 
సమస్యల ముళ్ళకిరీటాన్ని
ధరించడం బాధలు భరించడం నేర్పించు !

0️⃣2️⃣
నీ ముఖానికి...
తృప్తిగా నవ్వడం నేర్పించు !
 
0️⃣3️⃣
నీ పెదవులకు...
సత్యాన్ని పలకడం నేర్పించు !

0️⃣4️⃣
నీ చెవులకు...
మంచిని వినడం నేర్పించు !

0️⃣5️⃣ 
నీ చేతులకు... 
దానం చెయ్యడం నేర్పించు !
 
0️⃣6️⃣ 
నీ కళ్ళకు... 
కరుణను కురిపించడం నేర్పించు ! 

0️⃣7️⃣
నీ కాళ్లకు... 
దైవ సన్నిధికి పరిగెత్తడం నేర్పించు !

0️⃣8️⃣
నీ మోకాళ్లకు...
దైవం ముందు మోకరిల్లడం నేర్పించు ! 

0️⃣9️⃣ 
నీ స్వరానికి...
దైవాన్ని కీర్తించడం నేర్పించు !
 
1️⃣0️⃣
నీ హృదయానికి... 
పేదలను అనాధలను ప్రేమించడం నేర్పించు ! 

1️⃣1️⃣
నీ మనసుకు... 
రహాస్యముగా ప్రార్ధించడం నేర్పించు !
 
1️⃣2️⃣
నీ శరీరానికి...
పాపానికి పదిమైళ్ళ దూరంలో ఉండడం నేర్పించు !
 
1️⃣3️⃣
నీ జీవితానికి... 
సుఖంగా ప్రశాంతంగా బ్రతకడం నేర్పించు ! 

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502

0/Post a Comment/Comments