గుర్రాల ముత్యాల హారాలు.తేది.16-8-21. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా

గుర్రాల ముత్యాల హారాలు.తేది.16-8-21. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా

గుర్రాల ముత్యాల హారాలు
తేది.16 -8-21 ముత్యాల హారాలు

451) సాయిబాబా దయ చూడు
         హారతి ఇస్తున్నాం నేడు
         నీవేగా మా తోడు
         ఇక మమ్ముల కాపాడు.

452) చుట్టూ చిమ్మ చీకటి
         ఇది కాదా రేచీకటి
           ముడి పడింది భృకటి
            నువ్వు చేరింది ఏ తటి!

453) కాలం విలువ తెలుసు
         నన్ను చేయకు అలుసు
         ఇస్తున్నా గా గొలుసు
           త్రాగు నిమ్మకాయ పులుసు

454) రాధా ఏమిటి నీ సొద
        ఈ నోటు నీదే కద
         ఇంకా చేయకు సోద
          ఎక్కడిది ఈ రొద !

455) ఎవరిది ఈ చీపురు
         ఏమిటి ఈ పుకారు
         చెప్పవా షావుకారు     
         ఆపు ఇక నీ జోరు !

456) నెమలి తన పురి విప్పింది
         కోమలి నెల తప్పింది
          ఆ మాట ఆమె చెప్పింది
           అది అంతట గుప్పుమంది !

457) చిన్న చిన్న కథలు చెప్పు
          వాటి మతలబును విప్పు
          ఎప్పుడు చేయకు అప్పు
          కొట్టుకోకు ఇక డప్పు !

458) చాక్ పీసుతో  రాయి
         బాగుంది కనుదోయి
         నిన్నే ఇటు రావోయి
         సాయం చేయవోయి!

459) నువ్వు గట్టిగా కొరుకు
         పడవద్దు ఇక చిరాకు
         ఏమిటో నీ పరాకు
         మరి దగ్గరికి రాకు!

460) రావే నా మరదలా
          పొంగిపొరలే వరదలా
           జారే పాదరసంలా
           పురివిప్పిన నెమలిలా !

461) ఏమి చూపుల బాకులు
         కొరుకు తినే ఆ చూపులు
          వయ్యారాల ఊపులు
          అవి కాముని చూపులు !

462) డబ్బుకు ఉంది ఇబ్బంది
         ఎక్కడరా సిబ్బంది
          చేయాలి  పాబంది
          సరే అని ఒప్పుకుంది !

463) దారిపొడవునా దొంగలు
         నీళ్ళు నిండిన బుంగలు
          అసలు దొంగ గంగులు
           మారుస్తారు రంగులు !

464) నిండుగున్న పాలకుండ
         తీసుకెళ్లు గోలకొండ
          ఉన్నా నీకు నేనండ
           వేస్తాగ మెడలో దండ !

465) తిమ్మిని బమ్మిని చేయకు
         ఎవరిపై నిందలేయకు
          నీవు నేలపై రాయకు
         తారు అసలు పూతకు !

466) ఆడపెట్టు సిరాబుడ్డి
         పీకొచ్చావా గడ్డి
          వీడేనా పుట్టుగుడ్డి
           తీసుకోరా ఈ చెడ్డి !

467) పచ్చగడ్డి కోసుకరా
         పార గూడ తీసుకరా
          గడ్డిమోపు మోసుకరా
          ఆవుల కాసుకరా !


0/Post a Comment/Comments