గుర్రాల ముత్యాల హారాలు . తేది.17-8-21. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

గుర్రాల ముత్యాల హారాలు . తేది.17-8-21. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

గుర్రాల ముత్యాలహారాలు.
తేది 17-8-22. ముత్యాల హారాలు

511) రానంటూనే వస్తావు
        నువు ముస్తాబు చేస్తావు
        దర్పణం చూపిస్తావు
        ఇక నన్ను మురిపిస్తావు 

512) లేత పచ్చని చీర
        విప్పి చూడు దాని పొర
         మరి సన్నగుంది గదర
          ఎంత రా దీని ధర !

513) ఊరింది ఊరగాయ
         మరింత నూనె పోయ
         నీవు రుచి చూడవయ      
          మా బంగారు బావయ   !

514) మన పచ్చని పొలాలు
        ఆయెగా ప్లాట్ల పాలు
        రైతు కష్టం నేలపాలు     
        జనం పాలిటి శాపాలు !

515) గౌరవించు పెద్దల
       ప్రేమించు మన పిన్నల
        దైవాన్ని కొలవాల
        న్యాయం కై నిలవాల !

516) చిన్ని చిన్న ముద్దు పెట్టు
         బాగుంది నుదిటి బొట్టు
         చేయకు నీవు కనికట్టు
          ఏమిటి నీ మొండిపట్టు !

517) చితికిన మన బతుకులు
         ఎగుడుదిగుడు గతుకులు
         లేవు స్వాగత పలుకులు
          మరిచారు మందలింపులు !

518) ఇవి జీవిత సత్యాలు
        తెలుసుకోరా ముత్యాలు
         మోస్తున్నవా  బస్తాలు
         తెలుసుకో  వాస్తవాలు !

519) రాసి రాసి అలసినావు
        కలము ఏడ వేసినావు
        రంగేల పూసినావు
        అని అంటే నవ్వినావు!

520) దీపం ఆరిపోతుంది
        చమురేమో కారుతుంది
        చీకటి పెరుగుతుంది
        వెలుగేమో తరుగుతుంది !

521) మనసు మనసు కలిసింది
        తను ఎంతో మురిసింది
         ప్రేమ జల్లు కురిసింది
        ప్రేమకు తలుపు తీసింది !

528) పసుపు రాసిన పాదాలు
         చేయకు నీవు వాదాలు
          చేస్తే చేయి  సోదాలు
           దొరికినవా వేదాలు !

529) కాలనాగు బుస కొట్టింది
         ఉపాయం నాకు తట్టింది
         పడగ అది ఎత్తి పట్టింది
         ముంగీస వచ్చి పట్టింది !

530) చేయకురా నీవు తప్పు
        కలుగుతుంది ఇక ముప్పు
        అసలు చేయకు అప్పు
        నిజాన్ని నీవు  చెప్పు !

531) చిత్తుచిత్తుల బొమ్మ
        జొన్నవిత్తుల బొమ్మ
         కట్టు దానికి దిమ్మ
         నిలబెట్టు నీవమ్మా !

532) పట్టకు నీవు పంతం
         చేసుకోవాలి శాంతం
         జీవితం ప్రశాంతం
          తెలుసుకో నా కాంతం !

533) ఇటురా ఓ మిత్రమా
       చదివేది ఈ పత్ర మా
        ఏదైనా శాస్త్రమా
        ఇది నీ గోత్ర మా ?

534) రాజు పేద అయ్యాడు
        దానం అతను ఇవ్వడు
        పాపం అసలు చేయ్యడు
        నిందలు తాను మొయ్యడు !

535) సత్యమునే పలుకుము
         వాస్తవాన్ని తెలుపుము
         మన కీర్తిని నిలుపుము
          శాంతిని నెలకొలుపుము!

536) వాడు బంగారు బుల్లోడు
         సిగ్గు అసలు లేనోడు
          గిరికీలు కొడుతుంటడు
          ముసలం పెడుతుంటాడు!

537) సుఖం అనుభవించు రాజ
          ఏడ ఉన్నావు  కాంభోజ
          ఎక్కడ వెళ్ళింది అంబుజ
           తిని వెళ్ళిందా కర్బూజ !

538) గుళ్లో జరుగుతుంది పెళ్లి
         నువు ముందుగానే వెళ్లి
         చూడరా మళ్లిమళ్ళి
         ఏడవకు  కుళ్ళి కుళ్ళి !

539) చదువు నేర్చుకుని రా
         పరువు నీవు తీయకురా
         నిండుగాను ఉండరా
         అప్పుడే పండుగరా !

540) గంప నిండా పండ్లు
         తేలేయకు నీ కండ్లు
         తీసేయ్ ఆ బెండ్లు
         పడతాయిరా గుండ్లు !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెం.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments