75 వసంతాల స్వాతంత్ర్య భారతం

75 వసంతాల స్వాతంత్ర్య భారతం

మన వాడే  మనలను  దోచుకుంటున్నాడు

ఎందరో త్యాగధనుల త్యాగఫలం
మనమీనాడు అనుభవించుచున్న 
స్వాతంత్ర్యం 
కానీ 
ఏదీ   స్వేచ్ఛ , 
ఎక్కడ  స్వాతంత్ర్యం 

75  ఏళ్ళ స్వాతంత్ర్య భారతంలో
75 ఏళ్ళ ముదుసలికి కూడా లేదు భద్రత
పుట్టుకొచ్చారు చెదపురుగుల్లా కామాంధులు
కామం నిండిన కీచకులు
ముదుసలి యన్న లేదు 
ముక్క పచ్చలారని పసి పాప యన్న లేదు 
కోరిక తీర్చుకుని ప్రాణం తీస్తున్నారు పాపాత్ములు
ఎవరు గద్దె నెక్కినా గద్దలల్లె మారిపోయి
పేదవాడి పొట్టలోని మెతుకులు సైతం లాక్కుని తినే
లంచగొండి రాజకీయాలు
కులాల జబ్బులు, మతాల గబ్బుల
మారణాయుధాలు పట్టిన మానవ మృగాలు
అడవిన ఉన్న మృగాల నైజం తెలియును గానీ
మానవ తోలును కప్పుకుని సమాజంలో
క్రూరమైన తోడేళ్ళు మనుగడ చేసెను చూడు
నీతిని మరచి నిజాయితీని విడిచి
న్యాయం , ధర్మం కాళ్ళను నరికి
నిజానికున్న కన్నులు పీకి
అబద్ధానికి పీఠం వేసి
అన్యాయాన్ని అందలమెక్కించి
స్వార్ధం , కక్ష, ఈర్ష్యా , ద్వేషపు
ముసుగులు కప్పుకుని మూడునాళ్ళ మురికిమయ జీవీతాన్ని సుగంధంగా మురిసిపోతూ ముగిస్తున్నాడు
మూర్ఖ  మానవుడు
నీతీ , నిజాయితీ , మానవత్వమంటూ మడి కట్టుకున్న మహాత్ములు ఉండెను చూడు నూటికో, కోటికో ఒక్కరు
స్వతంత్ర్యానికి ముందు మనలను బ్రిటీష్ వాడను పరాయివాడు దోచుకున్నాడు
కానీ
స్వాతంత్ర్యానంతరం మనవాడే మనల్ని దోచుకుంటున్నాడు
పరాయి వాడిని గనుక పట్టుబట్టి పారద్రోలాము మనము
 మనవాడు మనల్ని దోచుకుంటున్నాడని తెలిసినా చేతులు ముడుచుకుని నోరెళ్ళబెట్టి  చేష్టలుడిగి చూస్తున్నారు జనము

శ్రీదేవి  అన్నదాసు
కలం     శ్రీనివాస్ 
 రాజమండ్రి 
తూర్పుగోదావరి జిల్లా 
ఆంధ్రప్రదేశ్ 
చరవాణి   93970806130/Post a Comment/Comments