75ఏళ్ళ భారతం - వ్యాస రచనా నియమాలు

75ఏళ్ళ భారతం - వ్యాస రచనా నియమాలు

 75ఏళ్ళ భారతం


భారతదేశ పౌరులుగా ఈ దేశానికి  మనము ఏమి ఇచ్చామన్నదే ప్రధానం. 

కానీ “ఈ దేశం నాకేమిచ్చింది” అనే నిస్పృహలోకి యువత వెళితే మాత్రం చాలా ప్రమాదం.

వైషమ్యాలు లేని సమన్యాయ పాలన ద్వారా మాత్రమే దేశపురోగతి సాధ్యమవుతుంది.


అనేక  సంఘ సంస్కరణ, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలతో పాటు స్వాతంత్ర్య  యుద్ధం కూడా జరిగింది. బ్రిటిష్  వలస పాలన నుండి యావత్  భారత్ అని చెప్పలేము… కానీ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు విముక్తి పొందాయి. కొన్ని సంస్థానాలు సొంతంగా విశాల భారతంలో విలీనమయ్యాయి. మరికొన్ని స్వతంత్రతను ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగాయి.


ఉద్యమం అణచివేత, దోపిడి, దౌర్జన్యాలు, వెనకబాటుతనం నుండి పుట్టుకొస్తాయి. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి గెలిచారు.  ఏ సమాజమైనా స్వేచ్చ, సమానత్వాన్ని కోరుకుంటుంది... స్వేచ్చ, సమానత్వం తో పాటు సమన్యాయ పాలనను ఆశిస్తుంది. 


దేశ ప్రజల అభివృద్ధిలో చట్టసభలు, న్యాయస్థానాలు, కార్య నిర్వాహక శాఖల  పనితీరు... ప్రజాసంఘాలు, విద్యావంతులు, మేధావుల పాత్ర, యువత ప్రభావం ఏవిధంగా వుంది. మొదలైన ఇలాంటి విషయాలతో వ్యాసం పరిపూర్ణంగా ఉంటుందని ఆశిస్తున్నాము......



వ్యాస రచనా నియమాలు:


  • వ్యాస లక్షణాలు: శీర్షిక, ఉపశీర్షికలు కలిగివుండాలి. శీర్షిక వివరణ, విషయ విశ్లేషణ, సూచనలు, సందేశం మొదలైన అంశాలతో వ్యాసం నిండుగా వుండాలి.

  • వ్యాసం విషయ నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, చక్కని భాషతో వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఎంపిక చేసుకున్న శీర్షిక పరిధిలో వుండాలి.

  • వ్యాసం నిడివి: 250-400 పదాలలో వుండాలి.

  • వ్యాసాలు టెక్స్ట్ రూపంలోనే పంపాలి. పిడిఎఫ్ మరియు ఇతర డాక్యుమెంట్స్ అంగీకరించబడవు.

  • వ్యాసాలు పంపుటకు తేదీ:12-08-2021 ఉదయం8గం.-రాత్రి8గం. వరకు .


(అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ మరియు మా వెబ్సైట్ https://www.pravahini.in/ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.)




ప్రవాహిని

తెలుగు సాహితీ సంస్కృతుల వాహిని

అంతర్జాల సాహిత్య పత్రిక













0/Post a Comment/Comments