గుర్రాల ముత్యాల హారాలు
ముత్యాల హారాలు.
121) భువిలో మొక్కలు అందం
దివిలో చుక్కలు అందం
తెలుగు దనం అందం
వెలుగు మన బంధం !
122) తెలుగు తల్లి కి శ్రీకార
వెలుగు కోటకు ప్రాకారం
ప్రార్థనకు ఓంకారం
పెద్దలకు నమస్కారం !
123) మంచికి ప్రాణం పోయ్యి
చెడును అంతం చెయ్యి
స్నేహానికి చేయి ఇయ్యి
వెనక తీయకు గొయ్యి !
123) తెలుగు భాష కమ్మన
మీగడ పాలు కమ్మన
చెరుకు రసం కమ్మన
పుట్ట తేనె కమ్మన !
124) మా ఢిల్లీ కోట ఎర్రన
నా కోటు బొత్తం ఎర్రన
మా కోతి మూతి ఎర్రన
జారి పడకు జర్రున. !
125) అతిగా మాట్లాడొద్దు
మితంగా తినడం ముద్దు
వేయకు అల్లరి ఏ పొద్దు
మానుకుంటే ముద్దు. !
126) అల్లిబిల్లి ఆటాడకు
వెళ్లి నీవు పేకాడకు
ఆటలో నీవు ఓడకు
మళ్లీ నీ ధైర్యం వీడకు !
127) మంచి ముత్యాలను ఏరు
రోడ్డుకు చేయుము తారు
వెంటనే తొక్కితే జారు
అవుతావు లే బేజారు !
128) కుళ్ళిన పండ్లను తినొద్దు
ఎవరిని గూడ తిట్టొద్దు
ఏ కుక్కలను కొట్టొద్దు
ఇరకాటం పెట్టొద్దు !
129) అందమైన మన దేశం
పసందైన ప్రదేశం
అందుకో సందేశం
పాటించు ఆదేశం !
130) తారలు మెరుస్తున్నవి
జల్లులు కురుస్తున్నవి
కలువలు మురుస్తున్నవి
నీట అవి చరిస్తున్నవి !
131) తీయని తేనెను నాకు
ముద్దుగ బిడ్డను సాకు
రుచిచూడు చెక్కర నాకు
నములురా తమలపాకు !
132) రైతుల బాధలను చూడు
వినేవాడు ఇకలేడు
అతనికి లేరు తోడు
ఐనా అన్నం పెడతాడు !
133) ఎరువుల ధరలు పెరిగే
సరుకులు మాత్రం తరిగే
రైతుల నడ్డిక విరిగే
బతుకు చితికి కరిగే !
134) శాంతి సహనం పెంచుకో
ఇచ్చి వచ్చి పంచుకో
తల భారం దించుకో
కోపాన్ని తగ్గించుకో !
135) ముద్దబంతి పూలందం
మూగమనసుల బంధం
విడిపోని సంబంధం
వారి ఈ అనుబంధం
136)గుమ్మానికి కడప అందం
ఇంటికి ముగ్గులు అందం
ఇంతికి కొప్పు అందం
కంటికి కాటుక అందం !
137) ముఖానికి ముక్కు అందం
ముక్కుకు ముక్కెర అందం
బుగ్గన చుక్క అందం
నుదుటన బొట్టు అందం !
138) అదిరే పెదవులు అందం
చెదిరే ముంగురులందం
హంస నడకలు అందం
సిగ్గుల బుగ్గలు అందం !
139) కురులకు పూలు అందం
తరుణులకు సిగ్గందం
స్త్రీ పురుషుల బంధం
పడిపోని అనుబంధం !
140) పిల్లల నవ్వులు అందం
మల్లెల సొగసులు అందం
ముద్దు మురిపాలు అందం
సుద్దుల ముద్దులు అందం !
141) మూతికి మీసం అందం
నాతికి సిగ్గు అందం
మెడకు గంధం అందం
గోడకు సున్నం అందం !
142) ఓడకు చుక్కాని అందం
మెడకు హారం అందం
చెట్టుకు ఆకులు అందం
పందిరికి లతలు అందం !
143) సిగలోన పూలు అందం
నగలోన మెరుపు అందం
వాకిట ముగ్గులు అందం
ఒంటికి వలువలు అందం !
144) మంచి దారిన నడవాలి
చెడు దారిన వదలాలి
న్యాయం కై నిలవాలి
సమరంలో గెలవాలి !
145) డొంకకు దారి అందం
జింకకు పరుగు అందం
వాగు కు వంక అందం
నింగికి చుక్కలు అందం !
146) ఉచిత లకు ఆశించకు
ఎవరినీ బాధించ కు
మరి నీవు ఎదిరించకు
సోమరి వై జీవించకు !
147) భాషకు వాక్కు అందం
ఘోషకు ముసుగు అందం
చేతికి గాజులు అందం
నాతికి నగలు అందం !
148) గురుదేవుల పూజించు
మాతాపితల ప్రేమించు
కృషితోనే శ్రమించు
సమంగా నీవు పంచు !
149) నిత్య స్నానం చేయాలి
ఇస్త్రి దుస్తులు వేయాలి
గుంజీలను తీయాలి
ముద్దుగా ముస్తాబవాలి !
150) పండుగలు పండుగలు
తెలుగు నేల పండుగలు
ఘనమైన పండుగలు
కావులే అవి దండుగ లు !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.