ఆగస్టు 9.. భారత్ చోడో..
క్విట్ ఇండియా ఉద్యమం రోజు
బ్రిటిష్ వలస పాలన కు
వీరుల్తై చరమాంకం పలికిన రోజు
విజయమో వీరస్వర్గమో అంటూ
గాంధీజీ ఇచ్చిన పిలుపునకు
ఉత్తేజితులై ప్రజలంతా
ఉప్పెనలా ఉప్పొంగిన రోజు
ఎందరో వీరులు
వీర మరణం పొందిన రోజు
ఢిల్లీ నుంచి గల్లీ దాకా
భారత్ చోడో అంటూ
ప్రవాహం లా సాగిన రోజు
భారతీయుల ఆత్మగౌరవానికి
పునాది పడిన రోజు.
చరిత్ర పుటలలో
చిరస్థాయిగా నిలిచిన రోజు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
--- వనం సావిత్రి
ఎన్టిపిసి రామగుండం