ఉన్నత విలువలతో కూడిన స్నేహం బంధాలను సమున్నతంగా నిలబెడుతుంది అవకాశవాద రాజకీయాలు స్నేహంలో పనికిరావు. --వడ్డేపల్లి మల్లేశము, 9014206412.

ఉన్నత విలువలతో కూడిన స్నేహం బంధాలను సమున్నతంగా నిలబెడుతుంది అవకాశవాద రాజకీయాలు స్నేహంలో పనికిరావు. --వడ్డేపల్లి మల్లేశము, 9014206412.

ఉన్నత విలువలతో కూడిన స్నేహం బంధాలను సమున్నతంగా నిలబెడుతుంది అవకాశవాద రాజకీయాలు స్నేహంలో పనికిరావు.(ప్రపంచ స్నేహ దినోత్సవం వేళ)


--వడ్డేపల్లి మల్లేశము, 9014206412.


    ఒక వ్యక్తిని గాని, వ్యవస్థను గానీ ,పార్టీని గానీ ,ప్రభుత్వాన్ని కానీ ,ఒక సంస్థను కానీ అంచనా వేసేటప్పుడు ఏ విలువల ప్రాతిపదికన పనిచేస్తుందో దాని ఆధారంగా  నిర్ణయం తీసుకుంటారు. ఆ విశ్వాసం మీదనే ఆధారపడి తదనంతర కార్యక్రమాలు కొనసాగుతాయి. బంధాలు ,అనుబంధాలు ప్రేమికుల మధ్య ప్రేమానుబంధాలు నిత్య నూతనంగా వర్ధిల్లడానికి స్నేహమే పునాది.

 రెండు వర్గాల మధ్య ఏర్పరచుకున్న   ఒక వారధి, లేదా ఒక ఒప్పందమే స్నేహం. స్నేహం  గూర్చి వ్యవస్థలు ,సంస్థల మధ్యన చర్చించుకున్న ప్పటికీ ప్రధానంగా వ్యక్తుల మధ్యన ఈ స్నేహాన్ని మనము అన్వయించుకుంటాం.


   స్నేహితం లో రకాలు ఉంటాయా:-

     స్నేహితం అంటే నే కలిసి పోవడం అని అర్థమైన ప్పుడు ఇందులో రకాలు ఏమిటి? అనే మాట వినబడుతుంది. ఒకరినొకరు పరస్పరం అవగాహన చేసుకుని నమ్మిన సిద్ధాంతాల ప్రాతిపదికన కొన్ని అభిప్రాయ భేదాలు ఇరువర్గాల మధ్య ఉన్నప్పటికీ మౌలిక విషయాలలో ఒకే అభిప్రాయం ఉంటేనే స్నేహం సాధ్యమవుతుంది. భిన్న అభిప్రాయాలు ఏ క్షణంలోనైనా ఇరువర్గాల మధ్య డామినేట్ చేసినప్పుడు కొనసాగుతున్న సంబంధాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది. అవి ఆర్థిక విషయాలు కావచ్చు, సిద్ధాంతపరమైన కావచ్చు, లేదా ఉనికికే ప్రమాదకరమైన విషయాలు కావచ్చు . అలాంటి పరిస్థితుల్లో స్నేహాన్ని సైతం మరిచి రహస్యాలు బయటపడే నేపథ్యంలో క్రమంగా బంధాలను తగ్గించుకుంటూ మనసు నొప్పించకుండా  దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.

     మరో సందర్భంలో తేనె పూసిన కత్తి లాగా బయటికి ప్రేమానురాగాలతో కనపడుతూ లోపల గోతులు  తవ్వే నీచ బుద్ది కలవారు కూడా లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రమాదాన్ని పసిగట్టి దూరంగా ఉండటమే మేలు అని నిర్ణయానికి వస్తారు.

 పై రెండు సందర్భాలలో కూడా స్నేహానికి అంతరాయం ఏర్పడ్డప్పుడు స్నేహబంధం జరుగుతుంది. కనుక స్నేహితం లో రెండవ రకమైన కుట్రలు, కుతంత్రాలు, స్వార్థము ,ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించాలనే దురాలోచన కలవారు కూడా లేకపోలేదు. కనుక స్నేహితులలో రెండవ వర్గమైన మోసపూరితమైన వాళ్ళు కూడా ఉంటారనే అవగాహన ఉండాల్సిన అవసరం చాలా ఉన్నది.


        స్నేహాన్ని కాపాడుకోవడం ఎలా:-

  ఒక్కొక్కసారి బంధువులు, రక్తసంబంధీకులు చేయలేని పని మనసుకు నచ్చిన స్నేహితులు ఎలాంటి ఇబ్బందులు అయినా ఓర్చి సకాలంలో సహకరిస్తారు. వాళ్ల ఇంటి బంధువుల లాగా కనపడి చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తారు. భిన్నత్వంలో ఏకత్వం లాగా వ్యక్తిగత పరంగా, ప్రవృత్తి పరంగా ఎవరి భావజాలం వారికి ఉన్నప్పటికీ రకరకాల పూలను దండ గా మార్చిన ఏక సూత్రం "దారం" లాగా స్నేహము రెండు మనసులను కాపాడుతుంది. బంధాన్ని నిలబెడుతుంది.  వారధిగా పని చేస్తుంది.

      కనుక తాత్కాలిక ప్రయోజనాల కోసం కావచ్చు, ఒకరి పురోగతిని మరొకరు తట్టుకోలేక అసూయపడే సందర్భంలో కావచ్చు, సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక ,అంశాల పట్ల తమ వైఖరిలో భిన్నాభిప్రాయాలు వలన కావచ్చు అప్పుడప్పుడు పొరపొచ్చాలు జరిగే ప్రమాదం ఉన్నది.  ఆ సందర్భంలో ఇరువురు పంతాలు ,పట్టింపులు పక్కనపెట్టి ఇతరులను గౌరవించాలని సంస్కారాన్ని మనసులో నిలుపుకుంటే ప్రమాదపు అంచున కు చేరుకున్న స్నేహం కూడా తిరిగి చిగురించిన మొక్క వలే పరిఢవిల్లుతుంది.


 స్నేహాన్ని కాపాడుకోవాలంటే ఇరువర్గాలు సంయమనం పాటించాలి .

       ఇటీవలి కాలంలో చాలా సందర్భాలలో మనం చూస్తున్నాం .. ఇంటి నుండి కలిసి వెళ్లిన స్నేహితులు గాయాలతో, రక్తపు మడుగులో పడి, శవాలుగా  మారి తిరిగివచ్చిన సందర్భాలు అనేకం  . యువతలో కూడా పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. ప్రేమ కోసం, స్నేహం కోసం ఆరాటపడిన వాళ్లే అనివార్యమైన పరిస్థితులలో వాళ్ల మధ్య ఏర్పడిన కలతలు కన్నీళ్లకె కారణమవుతున్నాయి.

 తర్వాత వాళ్ళ జీవితాలు జైలు పాలై అర్ధాంతరంగా ముగిసిపోవడాన్ని దయచేసి యువత ఒక్కసారి ఆలోచించాలి! యువతలో ఉన్న శక్తిని నిర్వీర్యం  చేసుకోవద్దు.   వ్యసనాలు, మద్యం ప్రధానంగా యువతతో పాటు అన్ని వయసుల వారి మధ్యన కూడా అగాధాన్ని సృష్టిస్తున్న వి. ఇక్కడే మనము స్నేహాన్ని కాపాడుకోవడానికి విజ్ఞతను ప్రదర్శించడం ద్వారా స్నేహ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలి.


 స్నేహం ఒక బంధమే కాదు ఒకే భావజాలం కూడా:-


 ఒకే భావజాలం కలిగి ఉన్న వ్యక్తులు అనేకమంది ఒక  సంస్థగా ,సంఘముగా ఏర్పడి ఉమ్మడి అభిప్రాయము, ఉమ్మడి విశ్వాసాల పరిధిలో  ఏకాభిప్రాయంతో అంగీకరించిన నిబంధనల మేరకు కలిసి పని చేస్తూ ఉంటారు .స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకే భావజాలం కలిగి ఉన్నప్పుడు బహుశా స్నేహాలకు పెద్దగా ఇబ్బంది రాదేమో! కానీ ఇది అంతటా సాధ్యమవుతుందని అనుకోవడం లేదు.

    స్నేహం అంటే యువతనే ఎక్కువగా స్పందిస్తుంది:-


      స్నేహం అనగానే యువకుల మధ్య ఉన్నది స్నేహం అని అపోహ ప్రబలంగా ఉన్నది. జాతీయ ,అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం రాగానే ప్రకటనలు ఇవ్వడం వాట్సప్లో పోస్టింగ్లు చేయడం ఎక్కువగా యువత చేస్తూ ఉంటుంది.  స్పందించినందుకు ధన్యవాదాలు, కానీ చిత్తశుద్ధి ప్రబలంగా ఉండాలని నిజజీవితంలో దానిని సార్థకం చేయాలని సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక పురోగతిలో యువత ముందు వరుసలో ఉండాలని సమాజం కోరుకుంటుంది. ఇదే సందర్భంలో యువతకు ఒక విజ్ఞప్తి సమాజ పరిణామ క్రమంలో దేశానికి అవసరమైన ప్రతిసారి తమ జీవితాలను బలిపెట్టి చరిత్రలో  ఆదర్శప్రాయంగా నిలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని భగత్ సింగ్ ,ఆజాద్, వివేకానందుడు, శ్రీనివాస రామానుజన్, ఉద్ధం సింగ్, తో పాటు అనేక మంది స్వాతంత్ర సమరయోధుల జీవితాలను అధ్యయనము చేసి తమ జీవితంలో కార్యాచరణకు పూనుకోవాల్సిన  అవసరం చాలా ఉన్నది. ఇదంతా నిజమైన స్నేహం వల్లనే సాధ్యమవుతుంది.

       అన్ని వయసుల వారికి కూడా స్నేహితులు ఉంటారు. ముదిమి వయసులో కర్ర చేతపట్టుకుని కాలం లెక్కించే పెద్దమనుషులకు, కార్ఖానాలో పొలాల్లో పని చేసే శ్రమ జీవులకు, విద్యాలయాల లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అన్ని వర్గాల వారికి స్నేహం ఉంటుంది .కనుక స్నేహం విశ్వజనీనమైన ది.

      

 మానవతా వాదానికి చిరునామా(కవిత)


 స్నేహానికి మూలం మనసు

 సానుకూల, మానసిక ప్రవర్తన

 ఆవేశం కన్నా ఆలోచన కు

 ప్రాణం కన్నా, త్యాగానికి విలువిస్తుంది.

 సజీవ సంబంధాలను

 ఎల్లకాలం నిలిపేది స్నేహం.


 స్నేహం అంతర్గతంగా దాగి ఉంటుంది.

 పరస్పర అవగాహన తో ఒకరికొకరు

 శ్రద్ధ తీసుకొని జీవించిన ఇది స్నేహమే,కానీ.!

 దూరానికి అతీతంగా కాలం ఎంత గడిచిపోయినా

 మాటల అనంతరం వచ్చినా

 ఎప్పటికీ నిలిచేది నిజమైన స్నేహం...

 ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా

 మధురమైన స్నేహబంధం

 మమతా అనుభూతుల్ని నింపుతుంది.

 అందుకే!

 స్నేహం "మానవతా వాదానికి

 చిరునామా కావాలి."


 (వడ్డేపల్లి మల్లేశం సామాజిక విశ్లేషకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట9014206412)

0/Post a Comment/Comments