ముత్యాల హారాలు . బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్ ఆర్ 9491387977.

ముత్యాల హారాలు . బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్ ఆర్ 9491387977.

గుర్రాల ముత్యాల హారాలు
ముత్యాల హారాలు  తేది.7-8-21


109). అమ్మ లేని జీవితం
         కాదులే ప్రభావితం
         తెలుసుకో సుభాషితం
        ఆమె మాట నవనీతం !

110) ఇవేనా మంచి ముత్యాలు
       ఇవి  నకిలీ ముత్యాలు
        చెప్పకు అసత్యాలు
        పాటించు నిత్య సత్యాలు !

111) చిలక ముక్కు ఎర్రన
        అవి వలలోన చిక్కున
       పెట్టు పంజరం టక్కున
       బంధించు గ్రక్కున.  !

112) అమ్మ బోనము  మొయ్యి
       వెన్నలోని నెయ్యి తియ్యి
       పొయ్యిమీద ఇక వెయ్యి
        సలసల ఇక కాగనియ్యి !

113) పోతురాజు ఆట ఆడు
         బోనం పాటను పాడు
        కుట్టుకునే చేతి తాడు
        ఉందిగా నీకు తోడు !

114). చేయవోయి జాతర
          వేయకు నీవు పాతర
          వాయించు ఇక సితార
          ఇది నీ యొక్క రాతర !

  115) పంటలను పండించు
           దుష్టులను దండించు
          చెడ్డమాటల ఖండించు
           పంటలను వండించు !

116) బంతి ఆట ఆడారా
        ఆడక నీవు చెడకురా
        దోస్తానును వీడకు రా
        పాడు పాట పాడకురా !

117) చిలక జోస్యం చెప్పు
        గుట్టు నీవిక విప్పు
       చలికి దుప్పటి కప్పు
        చేతపట్టు టీ కప్పు. !

118) వ్రాయుటకు ఉందా పెన్ను
         ఎవరు కనిపెట్టారు గన్ను
         తెరిచి చూడు నీ కన్ను
         ఎవరికి చూపకు వెన్ను !

119) నీవు డబుల్ గేం ఆడకు
       త్రిబుల్ గేమ్ వీడకు
        ఏ సినిమాలు చూడకు
        ప్లాస్టిక్ ను ఇక వాడకు !

120) బాలుర పలుకులు అందం
         చెట్టు చేమలు అందం
         పూలు పిందెలు అందం
         ప్రకృతి కూడ అందం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments