చూశారా మన భావి పౌరులు --డా వి.డి.రాజగోపాల్, 9505690690.

చూశారా మన భావి పౌరులు --డా వి.డి.రాజగోపాల్, 9505690690.

చూశారా మన భావి పౌరులు
ఆదివాశి తాండా అది   
అమ్మా నాన్నాలున్నారు
అయితే వారు అల్లారు ముద్దుగా
ఏ.సి.కార్లలో వీరిని  బడికి పంపే
అమ్మా నాన్నలు కాదు,

చూశారా మన భావి పౌరులు
ఆదివాసీ తాండా అది   
అమ్మా నాన్నలున్నారు
అయితే వారు అల్లారు ముద్దుగా
ఏ.సి.కార్లలో వీరిని  బడికి పంపే
అమ్మా నాన్నలు కాదు,

పిల్లలకు  కనీసం 
ఓ చొక్కా కొనలేని బతుకులు                      
పిల్లలను వదలి కూలీనాలీకి 
పొద్దుననంగా పోయి   
ఎప్పుడో చీకటి పడినాక వస్తారు
వీరిని  అడవి తల్లి పాలు చేసి,       
              
మనకు  స్వాతంత్య్రం  వచ్చి  
ఏడుపదులు పైబడి ఓ ఐదు ఏళ్ళు గడిచినా               
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి నిరాశ చెందిన
బతుకులు వీరివి            
అయినా దేశంపై  ప్రేమతో
ఉన్నంతలో 
వంటికి గుడ్డ లేకున్నా                           
ఓ జండా సంపాదించారు
మనసంతా దేశభక్తి తో సలామ్ చేస్తున్నారు


మన పట్ణణాలలో యువత  ఉన్నారు      
మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 
తెల్లమొహం వేస్తున్నారు
భగవంతుడా నీవే కాపాడాలి
ఈ నీ అడవి బిడ్డల్ని

డా వి.డి.రాజగోపాల్
9505690690

 

0/Post a Comment/Comments