కాలయాపన సెల్ ఫోన్ ఇమ్మడి రాంబాబు తొర్రూరు 9966660531

కాలయాపన సెల్ ఫోన్ ఇమ్మడి రాంబాబు తొర్రూరు 9966660531

సెల్ ఫోను తో కాలయాపన కారాదు
సాంకేతిక పరిపక్వత సెల్ ఫోన్
ఒకప్పుడు పిల్లలకు సెల్ఫోన్ వద్దన్నారు
నేడు సెల్ ఫోన్ లో పాఠాలు బోధిస్తున్నారు
చంటి పిల్లలకి సైతం సెల్ఫోన్ ఉంటేనే...
నోటిలో ముద్ద దిగుతుంది ఏడుపు ఆపుతుంది
అరచేతిలో ఫోను ప్రపంచమే గుప్పిట్లో
నాడు పనులు చకచకా సాగాయి
నేడు నోటి లెక్కలు సైతం అరచేతిలో దర్శనం
చరవాణి తో సంబంధబాంధవ్యాలు దూరం
నట్టింట్లో అందరూ కూర్చున్న 
చూపులన్నీ నెట్ ఇంట్లోనే
పాలపిట్ట వచ్చే ఉత్తరాలు మాయమయ్యే
సుడిగుండాలు వచ్చే ముఖాముఖి మాయం
ముఖ పుస్తకంతో పుస్తకాలు కనుమరుగాయే
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో 
మంచి పుస్తకం కొనుక్కో..నాడు
నేడు ఒంటి పైన చొక్కా లేకున్న
అరచేతిలో సెల్ఫోన్ ఆభరణం
నాడు ప్రభాతే కర దర్శనం
నేడు సెల్ ఫోన్ తోనే శుభోదయం
అర్ధరాత్రి అపరాత్రిల్లు ఆన్లైన్లోనే
చెడును దూరం చేయాలి
సెల్ ఫోను మంచికోసం వాడాలి 

రచన ఇమ్మడి రాంబాబు 
తోరూర్ మహబూబాద్ జిల్లా
చరవాణి: 9866660531


0/Post a Comment/Comments