శీర్షిక: ఉపశమనం. పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: ఉపశమనం. పేరు: సి. శేఖర్(సియస్సార్)

ఉపశమనం

ఎంతైనా కాలానుగుణంగా
మాటను మంత్రంగా 
మాయను సృష్టిస్తూ
నమ్మలేని నిజాన్ని 
మాటలకు గాలిని లేపనంగారాస్తూ
మనుషుల మనసును కొల్లగొట్టడమే 
నేటి నాయకులకలవాటు
గారడీల మాయజాలం
ఎన్నికలొస్తేచాలు 
నిర్ణయాలన్ని నిమిషాల్లో
పగటికలలను పండిస్తూ
గాలిమేడలు కళ్ళముందుంచుతూ
చెప్పిందేచెప్పి మతి చెదరగొడతరు
దళితరాగాలు దినపత్రికల్లో
ముత్యాల అక్షరాలతో మెరిపిస్తున్నరు
నిద్రలోకూడా అదే కలవరింత నేటి స్థితి 
ఎప్పుడూ ఎన్నికలుంటే ఎంతబావుండు
అందరికి అన్ని బందులిచ్చి
ఉన్న ఇబ్బందులు తరిమేతురు నాయకులు
ఉప ఎన్నికల్లో ప్రజలకింత ఉపకారం జరుగుతుంటే
ఐదేండ్లు ఇంకెన్ని జరిగేనో!
గెలిచినోళ్ళు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి
చల్లగ నీడపట్టునుంటరు
జనంగోడు పట్టదాయే
అందుకే ఉప ఎన్నికలే అందరికింత ఉపశమనం
----------------

సి. శేఖర్(సియస్సార్)
9010480557.



0/Post a Comment/Comments