అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా..... రచన: ఇమ్మడి రాంబాబు తొర్రూరు

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా..... రచన: ఇమ్మడి రాంబాబు తొర్రూరు

 


అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.....

రచన: ఇమ్మడి రాంబాబు తొర్రూరు


  స్నేహ మే రా జీవితం
  స్నేహమే...ప్రాణం
  *అమ్మ పేగు బంధం - తొలి స్నేహ బంధం.
  *అమ్మ ఒడి తొలి స్నేహం.
  *అమృతము ..అమ్మ లాలన స్నేహబంధం
  *బుడి బుడి అడుగుల్లో నాన్న స్నేహబంధం.
  *చిరు ప్రాయం లో - చిగురించేది స్నేహం.
  *బడిలో తొలి అడుగే స్నేహబంధం.
  *అంతస్తుల మరిపించేది స్నేహం.
  *అనుబంధాలను పెంచేది స్నేహబంధం.
  *శ్రీ కృష్ణ- కుచెలుల  బంధం 
  *ఆత్మీయ స్నేహబంధం.
  *రెండు మనసుల జత కలిపేది స్నేహం.
  *ప్రియతముల ప్రేమే స్నేహబంధం .
  *సమాజాన అనుభూతులు 
  *ఇచ్చేది స్నేహం 
  *అసూయాద్వేశాలను  
  *అణచి వేసేది స్నేహబంధం
  *పుడమిని తాకిన ..
  *తొలకరి జల్లే స్నేహబంధం.
  *అనురాగ విత్తులో..
  *మొలకే త్తేదే స్నేహబంధం.
  *మహా వృక్షం లా ఎదగాలి 
  *మన స్నేహ బంధం.
  *స్నేహ దీపానికి ..ప్రేమే చమురై
  *అంతరాల చీకటిని మరిపించి
  *అనురాగ బంధాల..
  * వెలుతురు విరబూయిదాం 
  * నేటి స్నేహబంధం సాక్షిగా.
  * కష్టాల  కడలి లో..
  * కడవరకు తోడు మీ స్నేహం.
  * ఆ నలుగురు తోడుడుండేది స్నేహబంధం.
  * కలకాలం కలిసి సాగుదాం..
  * స్నేహబంధం పునాదిగా


0/Post a Comment/Comments