గుర్రాల ముత్యాల హారాలు.తే.21-8-21 ముత్యాల హారాలు.
751) జీవన పోరాటం
సాధించు ఆరాటం
ఉండొద్దు ఆర్భాటం
తప్పులే సంకటం. !
752) అందరికీ నమస్కారం
ఇది మా సంస్కారం
అందుకోండి పురస్కారం
చేయకండి తిరస్కారం !
753) బాపు బొమ్మ సూపర్
కావద్దు నీవు సఫర్
పక్కకు జరుగు లోఫర్
అయ్యింది అది పాపులర్ !
754) వాడు బంకలా పట్టిండు
తుప్పు ఊడగొట్టిండు
ఫ్రేమును గూడా కట్టిండు
ప్లేటును ఊడగొట్టిండు !
755) నా మాట కాస్త వినురా
అది అమాయకురాలురా
నిజాలు తెలుసుకోరా
తెలిసి మసలుకోరా !
756) గోవిందుడు మా దేవుడు
మా ఇంటి శ్రీరాముడు
కొలిచే పరంధాముడు
స్మరించే సుధాముడు !
757) ఉన్న ఇల్లు అమ్మకురా
నిలువు నీడ పోవురా
నిజం తెలుసుకోరా
వాజమ్మవు కాకురా !
758) ఏడ్చి నీవు బెదిరించకు
అలా తలదించుకోకు
ఉంచుకో నీవే ఇల్లు
ఆపురా ఇక నీ సొల్లు !
759) అదిగో మన రామగిరి
చూసొద్దాం పద మరి
అక్కడ ఉంది జలసిరి
తీసుకోండిఇక ఊపిరి !
760) దండోరా ఉందిరా
గమనించి నడుచుకోరా
విన్నావా దామోదరా
సరే అదరగొట్టకురా !
761) ట్రాన్స్ఫారం అక్కడ ఉంది
ఉంటుంది మీకు ఇబ్బంది
లేరా కరెంటు సిబ్బంది
ఫిర్యాదు ఎవరికంది !
762) బతుకు బండి నడుపుకో
జీవన విలువ తెలుసుకో
పావని వై మసలుకో
లక్ష్మణ గీత గీసుకో !
763) ప్రమాదం పొంచి ఉంది
చూసుకొని నడవ మంది
పడొద్దు మీరిక రంది
అదిరి పోరాదని అంది !
764) కర్మ సిద్ధాంతం తెలుసా
మర్మం తో ఉన్న మనసా
ఎక్కడుంది నీశ్వాసా
తెలుపు ఆ నీగోసా !
765) నీవు కండలు పెంచావు
బుద్ధిని కుదించావు
సుషుప్తిగా ఉంచావు
ఊహల్లో జీవించావు !
766) అన్నం కంచం లో ఉంది
బుద్ధి గాను తిన మంది
కంచం కడగమంది
తను గడప దాటమంది !
767) దూడ కోసం ఈ గడ్డి
అలాగనా ఓ రెడ్డి
దూరమా ఆ దొడ్డి
కోసుకరా రెల్లు గడ్డి !
768) ఏంటిరా నీ అలుక
ఇప్పుడు నేను కులక
తెగ్గోసుకో నీ పిలక
అని చెప్పింది మన చిలక !
769) ఇది వనమూలిక దినుసు
చూపించుకో నీ పలుసు
చెయ్యకు నీవు అలుసు
తెలుసుకోర మా వాసు !
770) దొరగారు వచ్చినారు
జనం తోవ ఇచ్చినారు
వారు ముచ్చటించారు
ఔనని ఒప్పించారు !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్ 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.