జీవిత సంఘర్షణ..!(కవిత) ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

జీవిత సంఘర్షణ..!(కవిత) ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

జీవిత సంఘర్షణ..!(కవిత)

జీవితం ఎప్పుడూ మనమనుకున్నట్టుండదు..!
అలా అని 
జీవితాన్ని నిందించి, 
లాభం లేదు..!?
ఎలా ఉన్నా సర్దుకొని ముందుకు సాగాలి..!
జరిగే వన్నీ మంచికోసం అనుకుంటూ 
ఉన్న దాంట్లోనే, 
ఆనందాన్ని వెతుక్కోవాలి..!
ఎన్ని సమస్యలున్నా..
మనస్సుని, 
థమాయించుకోవడం నేర్చుకోవాలి..!
పైనున్న దేవుణ్ణి మాత్రమే, నమ్ముకోవాలి..!
మనుష్యుల్ని నమ్ముకుంటే నిరాశలే మిగులుతాయి..!
పైనున్న వాణ్ణి అర్థిస్తే..ఏదోక మార్గం చూపిస్తాడు..!
అల్లకల్లోలమైన జీవితాన్ని సరిదిద్దుతాడు..!
సంఘర్షణలకు లోనైన జీవితాలు రాటుదేలి,
మంచి భవితవ్యాన్ని చవి చూస్తాయి..!అందుకే 
జీవితం పట్ల సద్భావన తో ఉండాలి..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments