అజరామరం ---సి.హెచ్. రజిత, పెద్దపల్లి.

అజరామరం ---సి.హెచ్. రజిత, పెద్దపల్లి.



అజరామరం


*అ* జరామరత్వమై

*ఆ* నంత సౌశీల్య సరాగమై

*ఇ*ంపైన సోగసులతో

*ఈ* శ్వర సంకేతమై

*ఉ* షోదయ ఉషస్సులో

*ఊ* యాలుగే నా మాతృభాష...


*ఋ* ణము తీర్చుకోలేని సంబరాల సంతోషమై.. 

*ఎ* దలోని భావాలను

*ఏ* నాటికి వీడిపోని

 బంధముగా

*ఐ* కమత్య హోరుతో

*ఒ* కే పదమై, వాక్యమై

*ఓ* నమాలు దిద్దుతూ

 భవితతో సాగిపోయె నా అమ్మభాష... 


*ఔ* రా! తెలుగు భాష అనేలా

*అం* తరంగపు ఆత్మీయతను పంచుతూ

*క* నులముందు కదలాడి

*ఖ* గము వలె పయనిస్తూ

*గ* గనతలమున నిలిచె

*ఘ* నమైన నా మాతృభాష...


*చ*ంపకమాల చందమై

 *ఛ*ందస్సుతో అలరారుతూ

*జ* న్మతః మొదలై

*ఝ* రిసరాగల  సంగమమై

*ట* క్కున గుర్తులనిచ్చు

*డ* మడమ చప్పుళ్ళలతో

*ఢ* ంకా భజాయిస్తూ

*త* ళుకులీనుతున్న నా తల్లిభాష.... 


*ద* యను పంచినా

*ధ* రణి ఒడిలోన చైతన్యమై

*న* టరాజు నర్తనమై

*ప* లుకుబడులతో పరవశిస్తూ

*ఫ* లాలను అందిస్తూ

*బ*ంగరు బాటలో 

*భ* వితల పోరులో

*మ* మకారము పంచు మహోన్నత భాష... 


*య* వని వేకువకిరణమై 

*ర* మణీయ కావ్యాలతో

*ల* తాలలనల పదసంపదతో 

*వ* రమై  మనసున వికసిస్తూ

*శ* శిరేఖల సాహిత్య వేదికయై

*స* మస్త లోకానికి సన్నిధియై 

*హ* యిని పంచి హలములా స్యేదించు

*క్ష* ణము గడిచిన మనము వీడని మన మాతృభాష తెలుగుభాష.... 

తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలతో 


-సి.హెచ్. రజిత,

పెద్దపల్లి.





0/Post a Comment/Comments