మా "పల్లె"అందాలు--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు.

మా "పల్లె"అందాలు--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు.

మా "పల్లె"అందాలు
--------------------------------
తెల్లని మల్లెపూవుల్లా
పల్లెతల్లి ఎంతో అందం
చల్లని వెన్నెల కాంతుల్లా
ఎల్లరిలో వేయును బంధం

పుడమితల్లి ఒడిలో పైరులు
జలజల పారే సెలయేరులు
కొమ్మల నడుమ కోకిల పాటలు
ఎన్నో రకాల  పూతోటలు

పల్లె ప్రేమ పలరికరింపు
అణువణువునా పులకరింపు
ఆత్మీయ బంధాల గుబాళింపు
మధుర స్మృతులతో మది నింపు

కడుపునింపే అన్నదాతలు
కలకలాడు పచ్చని పొలాలు
ఎన్నో నాపల్లె అందాలు
అనురాగాలకు ఆనవాలు

--గద్వాల సోమన్న,
గణితోపాధ్యాయుడు.

0/Post a Comment/Comments