"అపర భగీరథుడు - కాటన్ దొర" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"అపర భగీరథుడు - కాటన్ దొర" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

అపర భగీరథుడు - కాటన్ దొర

ఉభయ గోదావరి జిల్లాలలో
అతివృష్టి అనావృష్టితో
విలవిలలాడుతున్న ప్రజలకు
నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి
ఆపద్భాంధవుడు అపరభగీరథుడు అయ్యాడు
క్షామ పీడితమైన ప్రాంతాన్ని
సస్యశ్యామలం చేశాడు
ప్రజల జీవన గతులను మార్చి
ధన ధాన్య సమృద్ధికి కృషి చేశాడు
ఆనకట్టలు నిర్మించడానికి తన
జీవితాన్ని ధారపోసిన ధన్య జీవి
పట్టుదల కలిగిన ఘనుడు
ధర్మ ఉపదేశకుడు
అంతటి మహాత్ముడి విగ్రహాన్ని
గోదావరి ఒడ్డున ప్రతిష్టించి కీర్తిస్తున్నారు
కాటన్ దొర గోదావరి ప్రజల
గుండెచప్పుడయ్యాడు

ఆచార్య ఎం.రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments