'రక్షాబంధనం..ఆరంభం!' --సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.

'రక్షాబంధనం..ఆరంభం!' --సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.


'రక్షాబంధనం..ఆరంభం!'
(వ్యాసం)


హిందూ బంధువులకు, చరిత్ర ప్రియులకు నమస్కారం
రాఖీ పౌర్ణమి సందర్భంగా 
శుభాకాంక్షలు! 

మనలో చాలా మందికి రాఖీ పండుగ అంటే అలగ్జాండర్ తక్షశిల రాజు పురుషోత్తముడిపై దండెత్తినపుడు, అలగ్జాండర్ భార్య లోక్సాన పురుషోత్తముడికి రాఖీ కట్టి తన భర్తను చంపవద్దు అని, అలాగే తన అన్న అయిన పురుషోత్తముని పై యుద్ధం చేయవద్దు అతనిని చంపవద్దు అని తన భర్త అలగ్జాండర్ ను వేడుకొని వారిద్దరినీ మంచి మిత్రులుగా చేసి... తరువాత ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి నాడు తను అన్నగా భావించిన పురుషోత్తమునికి రాఖీ కట్టి తన సోదర సోదరీ బంధం చూపించటం మనందరికీ తెలిసిందే..

ఇది కాకుండా..
మహాభారతం లో ఈ రక్షాబంధన్ గురించి ఇంకొక కథకూడా ఉన్నది. 

   శ్రీకృష్ణునికి "శృతదేవి" అను పేరు గల మేనత్త ఉండేది. ఆమెకు లేకలేక ఒక  మగసంతానం కలిగింది. ఆ బాలునికి శిశుపాలుడు అని పేరుపెట్టిoది. అతడు చూడటానికి వికారంగా ఉండేవాడు. కొందరు జ్యోతిష్యులు అతని జాతకం చూసి ఇతను ఎవరి స్పర్శతో అయితే సుందర రూపవంతుడు అవుతాడో వారి చేతిలోనే ఇతడికి మరణం సంభవిస్తుంది అని చెబుతారు, అలా కొంతకాలం గడిచాక  ఒకరోజు శ్రీకృష్ణుడు మేనత్త ఇంటికి వస్తాడు, అపుడు ఊయల లో ఆడుకుంటున్న శిశుపాలుని తన చేతిలోకి తీసుకుంటాడు ఆ స్పర్శ వలన శిసుపాలుడు సుందర రుపుడుగా మారుతాడు. అంత తన కుమారుని రూపం చూసి మహదానంద భరితురాలైన శృతదేవి.. తన బిడ్డ మరణం శ్రీకృష్ణుని చేతిలోనే అని తెలుసుకుని, శ్రీకృష్ణుని ఒక వరం కోరుతుంది. అంత శ్రీకృష్ణుడు నీ కుమారుని నూరు (100) తప్పుల  వరకు ఏమీ చేయను. అది దాటితే మాత్రం క్షమించను అని వరమిస్తాడు.

    కొంతకాలానికి నిండుసభలో శిశుపాలుడు శ్రీకృష్ణుని గురించి అనేకవిధములుగా దుర్భాషలాడుచుండగ 100 తప్పులు పూర్తికాగానే తన చేతిలోని సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి శిశుపాలుని శిరసు ఖండిస్తాడు. అపుడు శ్రీకృష్ణుని వేలు కూడా తెగి రక్తము కారుచుండగా ద్రౌపదీదేవి చూచి తన చీర కొంగు చింపి శ్రీకృష్ణునికి కట్టు కడుతుంది అపుడు శ్రీకృష్ణుడు. శ్రావణ పౌర్ణమి నాడు ఇదే నువ్వు నాకు కట్టిన రక్షాబంధనం. ఇకపై నీకు ఎపుడు ఏ ఆపద వచ్చినా ఈ అన్నను నువ్వు తలచుకో అని వరమిస్తాడు. అందువలననే నిండుసభలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేయాలన్నా
శ్రీకృష్ణుని లీల వలన అది సాధ్యం కాలేదు.

అలాగే భాగవతం లో మరొక కథ ఉంది.

రాక్షసులకు దేవతలకు యుద్ధం జరుగగా ఆ యుద్ధములో ఓడిపోయిన దేవేంద్రుడు, తన పరివారము తో అమరావతి లో తలదాచుకోగా ఇంద్రుడి భార్య శశీ దేవి శివపార్వతులను, లక్ష్మీనారాయణులను భక్తితో పూజించి ఆ పూజలో రక్ష అనే బంధనాన్ని ఒక పెట్టెలో పెట్టీ దానిని తీసుకెళ్లి మహాలక్ష్మికి ఇవ్వగా ఆ మహాలక్ష్మి బలిచక్రవర్తి కి రక్షాబంధనం కట్టి ఆయనను విడిపించినది అని కూడా ఉన్నది.

"ఎనాబందో బలిరాజా దానవేంద్రో మహాబలం!
తేనత్వామభి బద్నాభి రక్షమా చలమాచలా"
అని చెప్పి రక్షాబంధనం కట్టాలి.

దీని అర్ధం:- దానవేంద్రుడు మరియు మహా బలశాలి అయిన బలిచక్రవర్తిని బంధించి, శ్రీ మహావిష్ణువు శక్తిని నీకు రక్షగా బందిస్తున్నాను. ఓ రక్షాబంధనమా నువ్వు ఏమాత్రం చలించక వీరిని రక్షించు అని. 

రక్షాబంధనం అంటే శ్రీ మహావిష్ణువు శక్తి అని అర్థం కూడా వస్తుంది.

కావున మీ అందరికీ అన్నా చెల్లెళ్ళ అనురాగానికి ప్రతీక అయిన రక్షాబంధన శుభాకాంక్షలు.


--సుజాత.పి.వి.ఎల్, 
సైనిక్ పురి, సికిందరాబాద్.


0/Post a Comment/Comments