"కార్గిల్ విజయపతాకం" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"కార్గిల్ విజయపతాకం" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

కార్గిల్ విజయపతాకం

భారత్ - పాకిస్తాన్ ల మధ్య
సరిహద్దు ప్రాంతంలో జరిగిన
కార్గిల్ యుద్ధ విజయం వెనుక
వీర సైనికుల త్యాగం మరువలేనిది
ఎత్తయిన పర్వత శిఖరాలపై
దొంగచాటు చొరబాటుదారుల
మెడలు వంచింది భారత సైన్యం
దాయాది పోరును
సమర్థవంతంగా ఎదుర్కొని
విజయ పతాకం ఎగురవేసింది
పాకిస్తాన్ సైన్యంపై
భారత వీరులు త్రిముఖ
దాడి జరిపి వీరోచిత
పోరాటం చేసి విజయం సాధించారు
సిమ్లా, లాహోర్ ఒప్పందాలను
తుంగలో తొక్కి సరిహద్దు
ప్రాంతాలపై ఆధిపత్యం చూపిన
పాకిస్తాన్ సైనిక దళాలను
మట్టి కరిపించి 
శత్రుదేశపు గర్వాన్ని అణచిన
వీర జవానుల విజయ దరహాసమే
కార్గిల్ విజయోత్సవం


ఆచార్య ఎం.రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments