రామప్ప వైభవం ---సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.

రామప్ప వైభవం ---సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.

రామప్ప వైభవం

           
ఓరుగల్లు గడ్డ చారిత్రాత్మకం
కాకతీయుల కళా పోషణ
వినుతి కెక్కిన తెలంగాణ
చూడచక్కని తెలుగు సున్నితంబు!

గణపతిదేవుని పాలనా కాలం
రేచర్లరుద్రయ్య
ఆధ్వర్యంలో నిర్మాణం 
రామప్ప మలచిన దేవాలయం
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

నర్తకీమణుల పేరిణీనృత్య భంగిమలు
నీటిపై తేలియాడు ఇటుకలతో
ఇసుక పునాదిపై మందిరం
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

రామలింగేశ్వరస్వామి కొలువైన కోవెలా
రామప్ప పేరిట మారిందిలా
తెలంగాణ పురాతన ప్రాచుర్యమిలా
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

ప్రపంచ వారసత్వ సంపద
పర్యాటకుల సందడి ఆకర్షించగ
యునెస్కో గుర్తింపు నిర్మాణం
చూడచక్కని తెలుగు సున్నితంబు
        
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
చరవాణి:9505152560

           

0/Post a Comment/Comments