- మార్గం కృష్ణమూర్తి
శీర్షిక: చరవాణిలో బాల్యం బందీ
విధి విచిత్రం
కరోనా కాలం
పెరిగెను భారం
మార్చను ఎవరి తరం!
బడులు లేవు
బజారులు లేవు
స్నేహితులు లేరు
ఆట పాటలు అసలే లేవు!
ఇల్లే ఒక బంధీఖానా
లేదంటే దవాఖానా
బజారుకెడితే జైల్ ఖానా
పోలీస్ కొడుతే మరోఖానా!
కాలం గడిచి పోతుండే
చదువు ఆగి పోతుండే
విధిలేక చరవాణి లోనే
తరగతులు ఆన్లైన్ లోనే!
చరవాణి అలవాటాయే
తరగతులయి పోగానే
యూట్యూబు,వాట్సాప్ లాయే
చరవాణికి రుచిమరిగి పోయే!
కళ్ళు మండుతుండే
ఆరోగ్యం పాడవు తుండే
చరవాణికి బాల్యం బందీయాయే
బయటపడటం సాధ్యం కాకపాయే!
- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్
Post a Comment