వెచ్చని సూర్యోదయం
చీకటినిండిన లోకన్నంతా
నిద్రమత్తు పులుముకుని తనువంతా సోయిమరచి
అందరూ ఆదమరచి సేదతీరుతున్నపుడు
చీకటి దుప్పటి నుండి ధరణినంతా మెల్లగా
మేల్కొల్పేందుకై భానుడు బయలెల్లాడు
ఆకాశపు అంచులను స్పృషిస్తూ
చీకటి మేఘాలకు వెలుగు రేఖలద్దుతాడు
లోకమెంత సోమరితనంతో మనసంతా చీకటినింపుకున్నా
ఇనుడి కిరణాలు తాకగానే నిదురనంతా పక్కకు దొర్లిస్తూ
కళ్ళను నులుముతూ వెలుగునింపుకుంటుంది
జీవులన్నీ కొత్తరెక్కలతో కోర్కలతీరాలనందుకునేందుకు
సూర్యుని తేజస్సును తనువంతా అద్దుకుని శక్తినంతా దారపోసేందుకు
హూషారుతో బారుకడుతూ జీవనగమనంలోకి అడుగిడతాయ్
అవని సమస్తం ఆనందం
ఆకాశాన్ని తాకి అంతరిక్షదారుల్లోకి పయనం
చరాచర జీవరాసులకి శక్తిప్రధాత సూర్యుడే కదా
సూర్యుడే మనిషి గమనం
మానవ మనుగడకు ఆధారం
సూర్యుని పయనం చేర్చును లక్ష్యం
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.