ఉత్తమగుణం ....డా. రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, మేడ్చల్.

ఉత్తమగుణం ....డా. రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, మేడ్చల్.

ఉత్తమగుణం
....డా. రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, మేడ్చల్.


ఇంగితమున్న మనిషికి తప్పక‌ కావాల్సింది
విషయమున్న ప్రతిపనికి పాటించాల్సింది
బాల్యం నుంచి బ్రతుకు ఆఖరు వరకు
అందరూ ఆచరించాల్సిన గుణం
సమయానికి ఆచరించాలనే జ్ఞానం
విధివిధానాలను తప్పకూడదనే నిబంధన
నియమనిష్ఠలతో సక్రమంగా చేయాలనే ఆలోచన
వ్యష్ఠి నుండి సమష్ఠి వరకు కావాల్సిన సూత్రం
విజయాలకు మూలాధారమై నిలుస్తుంది
నిగ్రహానికి నిలువెత్తు నిదర్శనమై కనిపిస్తుంది
గౌరవాన్ని,పూజ్యనీయతను పెంచుతుంది
బద్ధకాన్ని,నిర్లక్ష్యాన్ని తొలగిస్తుంది
నలుగురిలో నిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది
గెలుపు బాటలకు సోపానమై కుదురుతుంది
విశిష్ట వ్యక్తిత్వాన్ని పంచి నిజమవుతుంది
వ్యవస్థకు శ్రీరామరక్షగా తోడుంటుంది
స్వచ్ఛతకు,పవిత్రతకు పాత్రమవుతుంది
లోకకళ్యాణానికి నాందీవాచకమై వెలుగుతుంది.
ఆపదలు రాకుండా సుదర్శనచక్రమై అడ్డుకుంటుంది
మనిషి నుండి 'మనీషి'ని చేసి చరిత్రలో స్థానం కల్పిస్తుంది
ఆరోగ్యాన్ని పెంచి,ఆయుష్షునిచ్చి ఆశీర్వదిస్తుంది
స్వీయ క్రమశిక్షణ నైతికవిలువల రాజమై 
జీవితాన్ని ఆనందమయం చేస్తుంది
అందరూ పాటించాలి-వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి.


0/Post a Comment/Comments