*ముత్యాల హారాలు* చైతన్య భారతి పోతుల

*ముత్యాల హారాలు* చైతన్య భారతి పోతుల

*ముత్యాల హారాలు*
----చైతన్య భారతి పోతుల

221.
అహం గోడలు పడగొట్టు
కులమతాలు విడిచిపెట్టు
మానవతను మదిని పెట్టు
మేధస్సుకు పదును పెట్టు
222.
మలినమైన మట్టిబుర్రలు
బూజు పట్టిన భావాలు
బురదలో అభ్యుదయాలు
తెలుసుకోండి మరి పెద్దలు
223.
ఈర్ష్యా ద్వేషాలు 
కుళ్ళిన ఆలోచనలు
మలినమైన మనసులు
మీరా..?పెద్దమనుషులు
224.
స్వార్థం పెరిగి పోయింది
బుద్ధి కుళ్ళిపోయింది
మీ వెంట ఏమొస్తుంది
మార్చుకోరా మీ మనసు
225.
మూడునాళ్ళ ముచ్చట
జీవితమే ఒక ఆట
భూమి రంగస్థల ఆట
ఎరిగి నడుచుకోవాలంట
226.
దాచిపెట్టి ఏం లాభము
ఇక్కడే వదిలి పోతము
ఉన్నది పంచుదాము
పుణ్యo పొందుదాము
227.
అనాగరిక ఆచారము
అనాలోచిత నిర్ణయము
కాదు బుద్ధి వికసితము
కష్టాలే జీవితము

చైతన్య భారతి పోతుల
హైదరాబాద్
7013264464

0/Post a Comment/Comments