*దార్ల శతకం సమకాలీన సమస్యల విశ్వైక దృక్పథం*-ప్రవాహిని...💐💐

*దార్ల శతకం సమకాలీన సమస్యల విశ్వైక దృక్పథం*-ప్రవాహిని...💐💐

(Department of Telugu, HCU, Programme, 9.8.2021, 3.00 pm)*దార్ల శతకం సమకాలీన సమస్యల విశ్వైక దృక్పథం*

సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రాసిన దార్ల మాట శతకాన్ని పరిచయం చేస్తూ *'కొత్తపుస్తకంతో తో కాసేపు* కార్యక్రమాన్ని డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆచార్య వి.కృష్ణ  సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమకాలీన సమాజాన్ని చైతన్య పరిచే విధంగా దార్ల మాట శతకం ఉందనీ, సంప్రదాయ, ఆధునిక భావాల సమ్మేళనంగా ఈ శతకం ప్రతిబింబిస్తుందని అన్నారు. 
ఈ కార్యక్రమం ద్వారా కొత్త పుస్తకాలను పరిచయం చేయడానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. 
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల వల్ల పుస్తకపఠనం తగ్గుతున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయని, అదే శాస్త్ర, సాంకేతిక మాధ్యమాల్ని  ఉపయోగించి, నేడు పుస్తక పఠనం పై ఆసక్తిని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందని, దానికి తెలుగు శాఖ తలపెట్టిన   *కొత్త పుస్తకంతో కాసేపు* సంచికా కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని హెచ్ సి యూ, మానవీయ విభాగం డీన్ , ప్రముఖ హిందీ సాహితీవేత్త, అనువాదకుడు ఆచార్య వి.కృష్ణ పేర్కొన్నారు. తెలుగు శాఖ నూతనంగా తలపెట్టిన '*" సోమవారం సాయంత్రం జరిగిన *క్రొత్తపుస్తకంతోకాసేపు* సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి,  తెలుగు శాఖ అధ్యక్షుడు రాసిన దార్ల మాట శతకాన్ని ఆవిష్కరించి, ఆచార్య వి.కృష్ణ మాట్లాడారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కేవలం సాహిత్య విమర్శ, వచనకవిత్వం మాత్రమే రాస్తాడనుకొంటారనీ, కానీ ఛందోబద్ధమైన పద్యకవిత్వాన్ని కూడా రాస్తారని ఈ శతకం ద్వారా నిరూపించారని అన్నారు. ఆచార్య పిల్లలమర్రి రాములు గారు అధ్యక్షత వహిస్తూ ఆధునిక సమాజంలో వస్తున్న వివిధ ధోరణులను దార్ల ఈ శతకంలో  వర్ణించారని అన్నారు.  ఈ కార్యక్రమంలో మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తాలిశంకరరావు ప్రధానోపన్యాసం చేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మరుగున పడిపోతున్న మంచి పుస్తకాలు వెలుగులోకి వస్తాయని, అనేకమంది ఈ కార్యక్రమం ద్వారా కొత్త పుస్తకం చేయాలనీ, చదవాలనీ ప్రేరణ పొందుతారనీ, ఈ సభలో సమకాలీన అంశాలు, సాహిత్య విలువలతో కూడిన  దార్ల మాట శతకం పుస్తకంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సముచితంగా ఉందని వ్యాఖ్యానించారు.ఆచార్య విస్తాలి శంకరరావుగారి విశ్లేషణ, వివరణ ,వ్యాఖ్యానాలు , ఆకళింపులు, సమన్వయాలు , పోలికలు ,తులనాత్మకత,, కౌటుంబిక బంధాలు,సమకాలీన సమాజ చిత్రణలువంటి ఎంతో గొప్పగా  ఆవిష్కరించారన్నారు..
సభలో ఆచార్య జి.అరుణకుమారి, ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్,  ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి.విజయలక్ష్మి, డా.బి.భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి తదితరులు ప్రత్యక్షంగాను, ఆన్ లైన్లో విశ్వర్షి లాహిరి వసంతకుమార్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆచార్యులు చల్లా శ్రీరామ చంద్రమూర్తి, డా.ఎం.మంజుశ్రీ, ఆచార్య జి.యస్.మోహన్  సుమారు 150 మంది వరకూ  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

0/Post a Comment/Comments