ఆకాంక్ష ---తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (టీచర్) .. రాజన్న సిరిసిల్ల జిల్లా

ఆకాంక్ష ---తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (టీచర్) .. రాజన్న సిరిసిల్ల జిల్లా



ఆకలి కేకలు, ఆర్తనాదాలు
రైతుల ఆత్మహత్యలు లేని సువిశాల సుందర భారతావనిని
అబలలపై అత్యాచారాలు, కుల, మత ,వర్గ, వర్ణ, వివక్ష లేని సమసమాజాన్ని
రైతే రాజు అన్న మాటలు నిజం చేస్తూ రైతుకు సమున్నత స్థానం ఇచ్చే  రాజ్యాన్ని
నైపుణ్యాలతో పాటు నైతిక విలువలు నేర్పిస్తూ
యువతను సంస్కార వారధుల్ని చేసే విద్యా విధానాన్ని
పేదరికాన్ని రూపుమాపి జన్మించిన ప్రతి ఒక్కరికి మసకబారని బాల్యం అందించే అసలైన ప్రజాస్వామ్యాన్ని
మహిళల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే సాధికార సమాజాన్ని
పనికి తగ్గ వేతనం కల్పిస్తూ ప్రగతి రథ చక్రాలైన కార్మికులకు
అభివృద్ధి ఫలాల్ని అందించే అభ్యుదయ సమాజాన్ని
విశ్వమానవ ప్రేమను, వసుధైక కుటుంబ భావనను,
సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షించే  కలల భారతావనిని 
నాలోని కవితా(వేశం)లోచనలు
అవసరమైన వేళ ప్రశ్నల్ని సంధించే అక్షరాస్త్రాలుగా
ఓదార్పునిచ్చే మైత్రీ పరిమళాలుగా
ఉషోదయ భానుడిలా కాంతిని వెదజల్లే వెలుగురేఖల్లా
శరత్ చంద్ర కాంతి వలె చందన పరిమళాలు వెదజల్లుతూ సామాజిక స్పృహను, చైతన్యాన్ని నింపుతూ
సంఘ హితైషి కావాలని కాంక్షిస్తూ, ఆకాంక్షిస్తూ...


✍️ తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (టీచర్)
      రాజన్న సిరిసిల్ల జిల్లా
     

0/Post a Comment/Comments